పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/6

ఈ పుట ఆమోదించబడ్డది

1.రామానుజన్ స్నేహితులు

గణితంలో ‘నభూతో నభవిష్యతి’ అనిపించుకున్న మహా మేధావి శ్రీనివాస రామానుజన్ (22 December 1887 – 26 April 1920) లండన్ లో ఉన్న రోజులలో, "అంకెలు అతని సంగడికాళ్ళు" అన్నాడుట లిటిల్వుడ్ అనే పేరుమోసిన మరొక గణిత శాస్త్రవేత్త. సంగడికాడు అంటే స్నేహితుడు. స్నేహితులతోటీ, బొమ్మలతోటీ పిల్లలు ఆడుకున్నట్లే, రామానుజన్ అంకెలతో ఆడుకునేవాడని తాత్పర్యం.

బొమ్మ 1.1. శ్రీనివాస రామానుజన్


1.1 టేక్సీ సంఖ్యలు

ఒక సారి జబ్బుతో మంచం పట్టి ఉన్న రామానుజన్ ని చూడటానికి ప్రొఫెసర్ హార్డీ (G. H. Hardy, 7 February 1877 – 1 December 1947) టేక్సీ చేయించుకుని వెళ్ళేరుట. ఆ టేక్సీ మీద ఉన్న