పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[1, 2, 4, 10], [1, 2, 4, 11], [1, 2, 4, 12], [1, 2, 4, 13], [1, 2, 4, 14],

[1, 2, 5, 6], [1, 2, 5, 7], [1, 2, 5, 8], [1, 2, 5, 9], [1, 2, 5, 10].

ఇదే విషయాన్ని ఈ దిగువ బొమ్మలో కూడ చూపెడుతున్నాను.

బొమ్మ 7.1 రామానుజన్ ఇచ్చిన వర్గు రూపాల జాబితా

రామానుజన్ సాధించిన ఫలితం అవగాహన కాగానే గణితకులకి మరొక సమశ్య ఎదురైంది. మన మేధకి మరొక వర్గు రూపం స్పురించిందని అనుకుందాం. ఈ వర్గు రూపం తప్పో, ఒప్పో ఎలా తేల్చటం? అంటే ఆ రూపాన్ని ఉపయోగించి పూర్ణ సంఖ్యలన్నిటిని రాయగలమో లేమో ఎలా తేల్చటం? పూర్ణ సంఖ్యలు అనంతం కనుక ఇది సైద్ధాంతికంగా నిర్ణయించ వలసినదే తప్ప ప్రాయోగిక పద్ధతులు పనికి రావు.