పుట:Maharshula-Charitralu.firstpart.pdf/69

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

అష్టావక్ర మహర్షి

53


          డవును పరాశారుఁడవు మహాత్మః

సర్వమయుఁడవు మఱియు స్వేచ్చామయుఁడవు
ముక్తిమయుఁడవు నఖిల ముముక్షులకును
ముక్తిదాయకుఁడవు జగన్మూర్తి వీపు
నీకు నతు లాచరించెద నీరజాక్ష "
                         [ బ్రహ్మవైవర్తము - శ్రీకృష్ణఖండము ]

పిదప, అష్టావక్రుఁ డాపరమాత్మునియందు పవిత్రమగు తన మనస్సు లయ మొనర్చి శ్రీకృష్ణుని పాదములపైఁ బడి మరణించెను; వెంటనే యాతని తేజము దివ్యరూపమును ధరించి పుష్పక విమాన మధిష్ఠించి గోలోకమున కేఁగి ముక్తి నందెను. అప్పుడు శ్రీకృష్ణుఁ డాతని దేహమునకు దహనాది కృత్యములు స్వయముగా నొనర్చి యాతని కశ్రుతర్పణము లొసఁగి క్రియాకలాపములు పూర్తిచేసెను. ఇది యంతయుఁజూచి యాశ్చర్య నిమగ్నమైన రాధ యాతని వృత్తాంతముఁ దెలుపు మని శ్రీకృష్ణునిఁ బార్థించెను.

అప్పుడు శ్రీకృష్ణుఁడు వా రందఱు సావధానమనస్కులై వినుచుండఁగా నష్టావక్రమహర్షిని గుఱించి యిట్లు చెప్పెను; “ఈ మహర్షి యష్టావక్రుఁ డను నా పరమభక్తుఁడు, జితేంద్రియుఁడు, మహాతపస్సంపన్నుఁడు, బ్రహ్మవంశస్థుఁడు. తొల్లి సృష్ట్యాదిని నా నాభికమలమునుండి బ్రహ్మను బుట్టించి విశ్వసృష్టి చేయ నియోగించితిని. ఆతఁడు సనకసనందన సనత్కుమారసనాతన నామధేయు లగు నల్వురు కుమారులఁ దన మానసము నుండి సృజించి వారిని సృష్టింపుఁ డని కోరెను. వారు స్త్రీసంపర్క మొల్లక బరబహ్మానుసంధానమున నిత్య తపస్వులైరి. తరువాత వశిష్ఠాంగిరోమరీచి ప్రచేతసులు మున్నగు మానసపుత్రులఁ బుట్టించి వారిని జగత్సృష్టికై యుజుఁడు నియమించెను. వారందఱు మహాతపస్సంపన్నులై తండ్రి పనుపున వివాహమాడి