పుట:Maharshula-Charitralu.firstpart.pdf/147

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

దధీచి మహర్షి

131

అశ్వినీ దేవత లీవిషయము విని యొకనాఁడు దధీచికడకు వచ్చి “మునికులతిలకా.! తొల్లి మీ తండ్రియగు చ్యవన మహర్షికి నవయౌవన మొసంగిన యాశ్వినేయులము మేము. నీ వింద్రునివలన నెఱిఁగిన శాస్త్రములను మాకిచ్చుచో మేము నీ కుపకృతి చేయఁగలము. కావున, నా శాస్త్రములను మాకు బోధింపు" మని వేఁడుకొనిరి. దధీచి తనకుఁ గల శాపవృత్తాంత మెఱిఁగించి తాను బోధింపఁజాల ననెను. అశ్వినులు “నీకెట్టి యుపద్రవము వచ్చినను నిన్నుఁ గాపాడు బాధ్యత మాది. మేము దేవహితార్థ మయియే ని న్నర్ధించుచున్నా" మని బతిమాలిరి. దధీచి యంగీకరింపఁగా వారొక యశ్వశిరమును గొనివచ్చి దధీచి తలఁదీసి యా యశ్వశిరము నదికి దానివలన శాస్త్రములు గ్రహించి యాతని పూర్వశిరమును భద్రపఱచి యుండిరి. ఇంద్రుఁడు దధీచి చేసిన పనికి వగచి వెంటనే సాయుధుఁడై వచ్చి దధీచి శిరస్సు నఱికి వెడలిపోయెను. వెనువెంటనే యాశ్వినీ దేవతలును వచ్చి దధీచి పూర్వశిరమును దధీచి కదికి యాతనిఁ బునరుజ్జీవితుఁ జేసి వెడలిపోయిరి.

దధీచి క్షుపుల పరస్పరవైరము

ఈప్రకారము పునర్జన్ముఁడైన దధీచిమహర్షి యొకనాఁడాతని బాల్యహితుఁ డైన క్షువుఁ డను రాజుచే నాహూతుఁడై యాతనియింటి కేఁగెను. క్షువుఁ డాతని నుచితరీతిని గౌరవించి మన్నించెను. కాని, కొంతసేపటికి వారొక వివాదమునకు దిగిరి. బ్రాహ్మణాధిక్యమును దధీచి నిరూపింపఁ దొడఁగెను. క్షత్త్రియాధిక్యము క్షుపుఁడు నిరూపింప మొదలిడెను. తుదకు వారివాదము తేలక శ్రుతిమించి రాగమునఁబడి యొకరి నొకరు నిందించుకొనఁ జొచ్చిరి. దధీచి కోపియై క్షుపునిఁ బొడిచెను క్షుపుఁ డొక మహాయుగమును