ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

రామగిరి సింగనకవి.

709

సంవత్సరముల కుండిన నుండవచ్చును. కాబట్టి యీసింగనకవి క్రీ. శకము 1340-78 (1262 శా. స.) సంవత్సరప్రాంతమున నుండవచ్చును."

ఇక్కడ మనము వ్రాయవలసినది కొంత యున్నది. పైసిద్ధాంతము ననుసరించుటకు ముందు దాని యథార్థము కొంచె మరయవలసి యున్నది. పద్మపురాణోత్తరఖండములోని కృతిపతి వంశావళి నిదివఱలో వివరించియున్నను దానిని మారనకృత మగుమార్కండేయపురాణములోని వంశవృక్షము నొక్కచో వివరించి పరిశీలించెదముగాక. అపుడు పంతులవారు వివరించిన సంబంధములు స్పష్టపడును. అవి యెట్లున్నవనఁగా :_


ఇట్లుగా నున్న పై రెండువంశములవారికినిఁ బంతులవారు కల్పించసంబంధ మూహకురాకు న్నది. మార్కండేయపురాణములో నున్న గన్న సేనానినే పద్మపురాణములోని మంచిగన్నయగాఁ బంతులుగారు పొరపడియుందురు. ఈ గన్న సేనాని నాగయసేనాని పుత్త్రులలో