ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

వెన్నెలకంటి వేంకటాచలము.

685

నుండి అతనివలన ఛత్రచామరాందోళికాది మహాగౌరవముల నందినట్లు తేలినది. ఈతిమ్మభూపాలుంగూర్చి న్యూయలుదొర కొంత వివరించె. అది వేంకటగిరివారివంశవృక్షములోనిదియై యున్నది. వెలుగోటివారనునది వేంకటగిరిసంస్థానికు లగువెలమలయింటి పేరై యున్నది. వారిలోఁ దిమ్మానాయఁ డనునతఁడు వెలుగోటివారిలో మూలపురుషుఁడు మొదలు లెక్కిం పఁగా నేడవపురుషుఁ డగుచున్నాఁడు. ఇతనికాలముమాత్ర మాగ్రంథములో వివరింపఁబడలేదు. కాని యితనికిఁ బూర్వులుగా నున్నవారిలోఁ గొందఱయొక్కయుఁ, బరమందున్న వారిలోఁ గొందఱ యొక్కయుఁ గాలములు వివరింపఁబడుటచేత నీతిమ్మానాయనికాలముఁ గొంత మనము దగ్గఱగాఁ దేవచ్చును. అదెట్లున్నదనఁగా :_

Vol. II Lists of Antiquities Page 241

Singama Naidu

(A bold warrior ; was protected by pratapa Rudra II.)

|

Anapota Naidu

won a battle in Sarwari year A D 1300.

|

Pedasingama Naidu ------- Dharma Naidu

--------------------------------|

-----------------------------------Timma Naidu

దీనిని దెనుఁగులో జూపెదను.

సింగమనాయఁడు.

(ఇతఁడు రెండవప్రతాపరుద్రునివలన సంరక్షించఁబడెను.)

|

అనపోతనాయఁడు

(ఇతఁడు క్రీ. శ. 1300 లతో సరియగు శార్వరి సం. లో నొకగొప్పయుద్ధమున గెలిచెను.)

|

పెద్దసింగమనాయఁడు --------- ధర్మానాయఁడు

--------------------------------|

-----------------------------------తిమ్మానాయఁడు