పుట:Kavijeevithamulu.pdf/679

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

673

సిద్ధమంత్రిచరిత్రము సూరయ కవికిఁ బ్రాచీనమైనదియును వేంకటాచలకవిచరిత్రము సూరనకవికి ననంతరకాలములో నిదియు నై యున్నది. ఈ రెండు చారిత్రములును గలిసినచో నీసూరన కాలనిర్ణయము తేలుటయేగాక అతని పూర్వులయొక్కయు ననంతర కాలములోని వారియొక్కయు చారిత్రములు దేలఁగలవు. కావున నారెంటిని నా 'కవికావ్యపశంసాచంద్రిక' నుండి విడఁదీసి దీనిలోఁ జేర్చు చున్నాను.

వెన్నెలకంటి సిద్ధయ్యచరిత్రము.

విక్రమార్కచరిత్ర మనుగ్రంథమును పైసిద్ధయ్య కృతినందె. ఆ గ్రంథములో నీతనివంశావళి వివరింపఁబడియున్నది. ఇతనిచారిత్రము నుడువునపుడే ఆగ్రంథమును రచియించిన జక్కనకవి చారిత్రముగూడ నుడువవలసియుండును గావున నిపుడు మొదట సిద్ధయ్యవంశచారిత్రము వ్రాసి అనంతరము జక్కనకవిచరిత్రము వివరించెదను.

సిద్ధనవంశము.