13 శ్రీరామ గ్రంథాలయసభ, సాలూరు,
ఇందు వివిధ విషయములకు సంబంధించిన 60,000 గ్రంథము
లు గలవు. ప్రతి వత్సరమును 6,000 గ్రంథములు చేర్చబడుచుండును.
750 పత్రికలు వచ్చుచున్నవి. పరిశోధనకు అగత్యములగు శాస్త్ర
విషయమైన పత్రికలు అన్నియు తెప్పింపబడుచున్నవి. కడచిన వత్స
రమున 1,000 మంది సభ్యులు గలరు. వారు 1,00,000 గ్రంథములను
చదివిరి. 1929 సంవత్సరము జూను నెల యందు ఈ గ్రంథాలయము
నకు 4534 మంది వచ్చి చదువుకొనిరి; 6081 గ్రంధములు ఎరువీయ
బడెను.
శ్రీరామ గ్రంథాలయసభ, సాలూరు.
పై గ్రంథాలయసభ 23-4-29 న జరిగెను. కార్యనిర్వాహక సంఘసభ్యుల ఎన్నికలు జరిగినపిమ్మట తీర్మానములు చేయబడినవి. అందుండి ఈ క్రిందివానిని ప్రకటించుచున్నాము.
1 దేశ భాషాభివృద్ధికిని, స్వాతంత్య్రమునకును పాటుబడుచున్న “దేశభాషోద్ధారకు లచిరకాలములో మరణించుటచే వారి మరణములకు యీసభవారు సంతాపమును వెలిబుచ్చుచూ, వారి ఆత్మలకు శాంతి నొసంగుగాత మని శ్రీరామచంద్రుని ప్రార్థించుచున్నారు, మరియు ఈ గ్రంథాలయమును స్థాపించిననాటినుండియు అనేక విధముల పోషించుచున్న శ్రీయుతి యామిజాల లక్ష్మీనరసింహంగారు వారి వార్షిక దశయందు కళత్రమును కోల్పోయినందున గొప్పకష్టము సంభవించి నందుననూ, యీసంఘము వారు విచారించుచూ వారికి సానుభూతి వెలి బుచ్చుచున్నారు.
2 ఈ గ్రంథాలయమునకు సర్వవిధముల పాటుబడి గత సంవత్సరం రు 50/- ల గ్రంథము లొసంగిన శ్రీయుత చొక్కాపు మారి నాయుడు, కావ్యనిధి తత్వవిశారద బిరుదాంకితులగు చెలికాని లచ్చారావు, ఆంధ్రదేశమున గ్రంథాలయోద్యమమునం దెక్కుడుగు పచారము నొనర్చిన శ్రీయుతి ముద్దా సోమప్ప శాస్త్రులగార్లు కీర్తిశేషు లైనందులకు వారి ఆత్మలకు శాంతినొసంగుటకు యీ సంఘమువారు శ్రీరామచంద్రుని ప్ర్రార్థించుచున్నారు.