పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/99

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురువు.

"ఇది బుధారాధన విరాజి కొమ్మనామాత్యపుత్ర తిక్కన సోమయాజి ప్రణీత భారతక ధానంతరము " అని తనయుత్తర హరివంశీ గద్యమున సోముఁడు వ్రాసియుం ట నీతఁడు తిక్కనయందు గురుభావముకలిగి ప్రవర్తిల్లైన ని నిర్నయింపనగును. ఈతఁడు తిక్కన వృద్ధాప్యమున పడుచువాఁడై యుండవచ్చును. శిష్యుఁడైనఁగావచ్చును.

ఇష్టదై వము.

తిక్కన సోమయాజికి వలెనే యీతనికి ఁ గూడ హరిహర దేవుఁడే యిష్ట దైవము. కావుననే బైచరాజు వేంకటనాధ కవి తన పంచతంత్రమున నిట్లు వక్కాణిం చియున్నాడు.


క.

ఏచనువుకలదు హరిహర
సాచివ్యమునొంద నన్యజనులకు మదినా
లోచింపఁదిక్కయజ్వకు
నాచనసోమునకు మఱియు నా కుందక్క.


మతము.

స్మార్త బ్రాహ్మణుఁడు. శివకేశవ బేధములేని మ హామహుఁడు నద్వయితీయని యాతని గ్రంథమునుబట్టియు శాసనమునుబట్టియు నిర్ణ యింపనగును.

తండ్రి.

ఎఱ్ఱయకవి సకలనీతి కధానిదానమునందీ సోము నినిట్లు వర్నించియున్నాడు.


చ.

వినుతియొనర్తు నాంధ్రనుక
వీంద్రుల నన్నయభట్టు దిక్కయ

  • * *నా

చనసుతు సోము భాస్కరుని ఇందలి “నా చననుతు" అనుదాని ననుసరించియు శాసనమునందలి “ నాచ నాత్మజః" అనియుఁ గలవాక్య ముల ననుసరించియు నీతని తండ్రి పేరు నా చన్న' యని తెలియుచున్నది. వీరభద్రరావు గారు శాసనము నందలి “నాచనాంబుధి:" అను వాక్యములఁజూచి 'నాచన' యీ తని తండ్రి పేరు కాదనిరి. 'నాచన' యనునది తండ్రిపే రు నింటి పేరుకూడనని తోచుచున్నది.

వ్రాసిన గ్రంధములు.

ఈతఁడు వ్రాసినది యుత్తరహరివంశ మొక్కటి యె దొరికినది. అదియైన కృత్యాతిలేదు. అదియెంతవఱకు వ్రాయఁబడినదో తెలియదు. సోముని వసంత విలాసము లోనిదని" అత్తరి విట నాగరికులు" అను పద్యము లక్షణ గ్రంధములఁజూచి వీ రేశలింగము పంతులు గారు వ్రాసి యున్నారు. “అంజెదవుగాక" అనునది రెండవ పద్యము. ఈరెంటిలో రెండవది యుత్తర హరివంశములోనిదే! “అత్తరివిట నాగరికుల” ను నది వైజయంతీ విలాసము లోనిదని శబ్దరత్నాకరములో వ్రాయఁబడియున్నది. నా మిత్రులగు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారా వసంతవి లాస గ్రంధమునందలి మఱికొన్ని పద్యములు దొరికినట్లు ను, వసంతవిలాసముయక్ష గానమైనట్లును చెప్పెదరు. శ్రీ మానవల్లి రామకృష్ణకవి గారి వద్ద వసంత విలాస ప్రతియు గారివద్ద వసంతవిలాస న్నట్లు కొందఱు మిత్రులు చెప్పెదరు. ఇదమిద్ధమని చెప్పు టకువీలులేక న్న ది. నాకుఁ దెలిసినంతవఱకుఁ గవిచరిత్రమును సంగ్రహ ముగ వ్రాసితిని. ఇందుప్రమాదములుండిన నుండవచ్చును. ఈమహాకవికవిత్వ విమర్శనమునకు మఱియొక సారి బ్ర యత్నింప దలఁచితిని. దయామయులగు చదువరులిందలి గుణదోషముల నరసి సత్యప్రకటనమునకు సాయపడుదు రుగాక!

వం. సుబ్బారావు.