ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

28

గణిత చ0ద్రిక.


సమ రేఖల పొడవును కొలువవచ్చును. లేక కొలతప్రకారము, సమ రేఖలను గీయవచ్చును.

సరళ రేఖలను గీయుటకు సామాన్యముగ కొలతబద్దను ఉపయోగించెదరు. కొలతబద్ద అంగుళపు అంచును కాగితము పైనుంచి 1 అను అంకెకు సరిగా ఒక బిందువు గుర్తించుము. ఎంత పొడవు ఉండవలయునో ఆగీటుకు సరిగా మరియొక బిందువు గుర్తించును. ఈ బిందువులను కలుపుము. సరళ రేఖను కొలుచునపుడు బద్దను సరళ రేఖకు సమీపముగ నుంచుము. బిందువు బద్ద అంచుకు సమీపముగ నుండని ఎడల కొలత సరిగా తెలియదు. కొలత బద్దను నిలువ బెట్టి చూచిన కొలత క్రమముగ నుండును.

ఈ దిగువ కొలతలుగల సరళ రేఖలను గీయుము ?

5.2 అం;
3.1 అం;
2.7 అం.

మీటరు కొలతనుగుఱించి కొంత నేర్చితిరి. 27 వ పుట లోని కొలత బద్దకు క్రింది వైపున సెంటిమీటర్లు గుర్తించబడినవి. ప్రతి సెంటిమీటరును 10 చిన్న భాగములుగ భాగించబడినది. ఈ చిన్న భాగమునకు మిలీమీటరని పేరు.