ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

58

చంద్రగుప్త చక్రవర్తి

ఈ శాసనమునందు నైదుగుఱు విదేశపురాజుల పేళ్లుదాహరింపఁబడినవి. వీరిలో అంతియోకుఁ డనువాఁడు ఆంటీయోకస్‌థియాన్ అను (Antiochus Theos) సిరియాదేశపు రాజు, ఇతఁడు క్రీ. పూ. 246 వఱకు రాజ్యముచేసెను. తురమాయే అనువాఁడు టాలిమీ ఫిలాడల్‌ఫస్ (PtolemyPhiladelPhus) అను నామముతో ఈజిప్టు దేశముపై రాజ్యముఁజేసీ క్రీ. పూ. 246 లో మృతుఁడయ్యెను. ఈతని కూఁతునే అంటియోకుఁడు వివాహమాడెను. అంతికిని అనువాఁడు ఆంటిగోనన్ గొనిటన్ అనునామముతో మకడోనియా రాజ్యమును సంపాదించి 239 వఱకు రాజ్యముచేసెను. అలికసుందరుఁడను వాఁడు పైరసు అనువాని కుమారుఁడు. అలెగ్జాండరు నాఁబడు ఎపిరస్ దేశపు ప్రభువు. క్రీ. పూ. రమారమి 260 వ సంవత్సరము వఱకు ప్రభుత్వముఁ జేసెను. మాగాస్ అనువాఁడు సైరిన్ దేశపురాజు టాలిమీకి సాపత్న్య సోదరుఁడు. 258 వ సంవత్సరమున పరలోకగతుఁ డయ్యెను,

పైని ఉదాహరింపఁబడిన పేళ్లుగలరాజు లచ్చటచ్చట భిన్న కాలములం దుండినను పై ఐదు పేళ్లుగల రాజులేక కాలము నందు భిన్నదేశముల నేలుచుండుట మేముదహరించిన సిరియా, ఈజిప్తు, మకడోనియా, ఎపిరస్, సైరిన్ రాజుల విషయమయ్యే సిద్ధించుచున్నది. కనుక కాలనిర్ణయ విషయములో పొరబాటెంతమాత్ర ముండుటకు వీలులేదు. ఇదియునుంగాక ఈ మెగాన్ తప్ప యీ నామధేయము గల మఱియొక రాజు లేనేలేఁడు‌.