పుట:Andhravijnanasarvasvamupart2.pdf/45

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా అమలాపురము తాలూకా యందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య 3,083 (1931).

అనాథపిండదుడు - శాక్యబుద్ధునికి సమకాలికు డైన యొక కోమటి. శ్రావస్తి పట్టణ మితని నివాసస్థానము. ఇఅని అసలు పేరు సుదత్తుడు. సుదత్తుడు మిగుల ధనవంతుడు, ఉదారుడు. నిరుపేదలైన వారికి, దిక్కుమాలిన వారికి నితడు చూపిన యౌదార్యమును బట్టి అనాథపిండదు డను పేరు వచ్చినది. బుద్ధదేవుడు రాజగృహమున నుండిన కాలముననే యతనిని శ్రావస్తికి గొనిరావలయు నని సుదత్తుడు ఎక్కువగ బ్రయత్నించెను.