పుట:Andhravijnanasarvasvamupart2.pdf/37

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

అనాంబట్టు - చిత్తూరు జిల్లా పుత్తూరు తాలూకా యందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య 85 (1931).

అనాకోడేరు - పశ్చిమ గోదావరి జిల్లా భీమవరము తాలూకా యందలి గ్రామము. జనసంఖ్య 886 (1931).

అనాగతవంశము - మైత్రేయుడను భవిష్యద్భుద్ధుని గురించి తెలుపు 142 పద్యముల పాలీకావ్యము. గంధవంశము ననుసరించి చూడగా నీ కావ్యమును రచించిన యతడు కశ్యపు డనియు, ' శాసనవంశదీపము ' ననుసరించి, యతడు చోళదేశీయు డగు కవి యనియు తెలియుచున్నది. అత డెప్పు డున్నది కాని, అతడు రచియించిన గ్రంథము లేవైన నున్నది లేనిది కాని మనకు దెలియదు. ' ఉపతిస్స ' నామాంచితు డొకడు దీనికి వ్యాఖ్య వ్రాసెను.

అనాగరకసంఘము - మానవజాతి ఈ భూమిపై బుట్టి యెన్ని యుగము లయినదో యెవ్వరును జెప్పలేరు. ఇప్పుడు కొన్నికొన్ని దేశములలోని జనులు నాగరకత జెందినవారై పట్టణములు, మేడలు, విద్యలు, కళలు, గ్రంథములు కలవారై శోభించు చున్నారు. కాని యీ నాగరకత యంతయు మానవజాతికి క్రమక్రమముగ లభించినదే కాని యొక్కసారి వచ్చినది కాదు. మొదట మానవ సంఘమునకును, ఇతర పశుసంఘమునకును అంతగ భేదముండి యుండదు. ఆదిమ మానవులు నగ్నులుగను, గుహలలో గాని, పొదలలో గాని వసించువారుగను, పచ్చికందమూలాదులను పచ్చిమాంసమును తినువారుగను ఉండియుందురు. అట్టివారు క్రమక్రమముగ నిప్పుడు మన మున్న నాగరకస్థితికి వచ్చుటకు నెన్ని లక్షల సంవత్సరములు పట్టినవో, ఏయేమి ట్లెట్లు ఎక్కుచు వా రింతవరకు వచ్చిరో నిశ్చయ