ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

130

ఉమర్ ఖయ్యామ్

510

ఈనిసి నీదురాక తరళేక్షణ ! ప్రాణికిఁ దేటు దెచ్చె ; నా
శ్రీనిదిభాగ్యరేఖ రిపుచిత్తములన్ దురపిల్లఁజేయు ; నేఁ
నీ నిముషానఁ గ్రుంకి శశియేగిన, దీపము లాఱిపోయినన్
మానిని ! నీవు గల్గఁగ దమస్సిటఁ జేర దిదే దివంబగున్.

511

నేనే నిక్కపుభాగ్యశాలి నయినన్ నీపాదపద్మాళికిన్
బ్రాణా లాహుతి చేసివైచేదఁ దృణప్రాయంబుగాఁ ; గాని, యో
చానా ! మత్తనుదర్థదూళిపయి యుష్మత్పాదమున్ మోపెదో,
హీనం బంచును రోసేదో, యెదను శంకింతున్ సముత్సాహినై.

512

ఓ వగలాడి ! నా వగలయోషధి ! యించుక కూరుకుండు ; మా
హా ! వగగూరువారివిధి మారయ నేర్తువు ; నేను నిన్ను వి
ద్యావతిఁ బ్రేమచేత "ఫరహాదు" వలెన్ వరియించినాఁడ ; నా
జీవితమూర్తి ! నిక్క మల "వీరిని" కంటెను మిన్నగావొకో.

513

పాపముచేత రూపు చెడి భాగ్యమువాసినవాఁడ నైన మా
యాపథి విగ్రహార్పకుని యట్టి హతాశుఁడగాను ; గాని, యే
మాపును సుందరీమణిని, మద్యమునున్ దలపోయువాఁడ ; నా
కీ పరతంత్రనన్ నరకమేటికి స్వర్గమనంగ నేటికిన్.