పుట:2015.333901.Kridabhimanamu.pdf/65

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మఱియు నందే శ్రీనాధుని చాటుధార యని
    'మత్తేభగామిని వృత్తస్తనంబుల
        వెలవంక లేమిట నిలుపువాడ '
అను చరణ ముదాహరింపబడినది., ఈ చరణము గల పద్యమెల్ల నాకన్యత్ర చేకూరినది. తనచేతి వ్రేలిగోరు విఱిగిపోగా శ్రీనాఢుడు చెప్పుకొన్నచాటు విది.

సీ, నీలాలకాజాలఫాలకస్తూరికా
         తిలకంబు వేమిట రిద్దువాడ
   నంగనాలింగ నాసంగసంగరఘర్మ
        శీకరణ్ బేమిట జిమ్మువాడ
   మత్తేభగామినీవృత్తస్తనంబుల
      నెలవంక లేమిట నిల్పువాడ
  భామామణీకచాభరణశోబిత మైన
     పాపటా నేమిట బావువాడ
 ఇందు నఖులను వేప్రొద్ధు గ్రిందుపఱచి
కలికి చెంగల్వఱేకుల కాంతి దనరి.
........................... అహ హ!
పోయె నా గోరు ! తనచేతిపోరు మాని.
క్ర్తీ.1830 ప్రాంతములందు 'ఆంధ్రభాషా మహావిద్వాంసు ' లని 'సర్వజ్ఞ 'లని నాటి మహావిద్వాంసుల చేతనే కీర్తింపబడిన మహనీయులు సి.పి.బ్రౌనుదొరగారు కధావివరణములలో శ్రీనాధుని చాటుధారలను గొన్నీం