పుట:2015.333901.Kridabhimanamu.pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మెంత యశ్లీలమైనను నది *(వీరభద్రుడు దక్షాధ్వర ధ్వంసములో జెలరేగితిట్టేడుతిట్టులలో నిక్కడ సొంపునే సంపాదించుచున్నది. అపుడు వీరభద్రుడు సభ్యమైన, సరసమైన, హితోక్తు లాడుటయేయస్వరస మగును.)

   మఱియు హరవిలాసము సప్తమాశ్వాసమున మాయాకిరాతు డర్జుని దిట్టుటలో

క. మండెడుబలువారమున
   గుందియ వగులంగ నేని కూల్చితి దీనిన్
   వెండి ప్రయోజన మేదీ
   రండాసుత ! దీనిపై శరము నిగుడింపన్ (హర.7-53)
మఱియు శిరరాత్రిమహాత్మ్యమున:
గీ.అనుచు విప్రుండు దమకించి యంటుకొనియె!
  సమ్మతించియ యుండె నా చంద్రవదన
  శూకలాశ్వంబు నసరేప జొచ్చినప్పు
 డనుమతింపదె యత్తకు వైనబడబ. (శివరాత్రి 3-69)
సి.గీ. ఎట్లు క్జను బ్రామి వచ్చునో యింటివారి
      నెట్లొ (చీకటి నొం)టి మై నింటి కఋఊఘూ
     నతివ పగలైన మాపైన నతనితోడ
    నిచ్చ నొకసారి గావించు నిధువనంబు. (శివరాత్రి. 3-114)
    "యధా యకారాదిపదం రత్యుత్సవనిరూపణే"
అన్న యచార్యదండియనుశాసన మిక్కడ నాగలేదు.


  • ఈ వాక్యముల నిట్లుగా చదువుడు: (ప్రకాశకుడు.) [దక్షాధ్వరధ్వంస కధలో దధీచి నిందాగర్బముగా వాడేడి పట్టుక నిక్కడ సొంపునే సంపాదించుచున్నది]