పుట:2015.333901.Kridabhimanamu.pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బందికత్తలు సురతప్రపంచవేళ
గంచియఱవత లసమాస్త్రుఖడ్గలతలు. (కాశీ. 3-1-09)

    ఈ పద్యము కాశీఖండము తృతీయాశ్వాసముననున్నది.  శృంగారప్రసక్తిలేనివాడు, భగవదారాధనపరుడు నగు శివశర్మ యను బ్రాహ్మణుడు తీర్ధయాత్ర సల్పుచు కాంచీనగరరము మీదుగా బోవుట యక్కడి కధాసందర్భము.  సంస్కృతకాశీఖండమున మీద నుదాహరింపబడినపద్యమునకు మూలము లేదు.  పైపద్యమునకు బూర్వోత్తర పద్యములు మాత్రమే యక్కడ సరసములు సంగరములు మూలానుగుణములును; అట్టితో నమూలక మయిన పై పధ్యము నక్కడ శ్రీనాధు డతకరించుట యనుచితము నసంగ్ల్ల్తమునుగ నున్నది.  శ్రీనాధుడు కాంచీఉరమున కరిగెను.  అప్పు డాతడు చెప్పుకొన్న చాటుపద్యము విడిగా నున్న జెడిపోవునన్న లోభముచే నిందు దూర్చినాడనియే నేను దలంచుచున్నాడాను.  సంస్కృతమున లేనిదాని, కధా సందర్భమున కనుచితమైనదాని నీపద్యమును శ్రీనాధుడు చెప్పుటకు గారణమేమై యుండునో యించుక  యోజించ్ వారికి గొచరింపపకపోదు.
    మఱియు గాశీఖండము సస్తమాశ్వాసమున దక్షాధ్వరధ్వంసకధలో.