పుట:2015.333901.Kridabhimanamu.pdf/215

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. మిరుతూరివిట్టమంత్రీ
    శ్వరుతనయ వరింఛె మల్లసచివాగ్రణి శం
    కరు డ్ద్రిరాజనందన
    బరిణయ మగుభంగి నధికభాగ్యోన్నతుడై. 9

ఉ. మల్లనమంత్రికిం ద్రిపుర
           మాతరళాక్షికి గాంతిరోహిణీ
   వల్లభు లాత్మసంభవులు
            వల్లభరింగనతిప్పనక్షమా
   వల్లభమంత్రిశేఖరులు
             వారవధూజనపుష్పభల్లు లు
   త్ఫుల్లయశోవిభాసితులు
         పుణ్యులు సింగనఖైరవేంద్రులున్. 10

వ. అందు 11

సీ. తారకామందారతారాచలంబుల
                తో రాయు వెవ్వానిచారుకీర్తి
    భావసంభవభద్రదేవేంద్రసూనుల
            మఱిపించు నెవ్వానిమహితమూర్తి
   జీమూతవాహనశిబిసూర్యతనయుల
            ధట్టించు నెవ్వానిదానశక్తి
   భార్గవగార్గ్యగీష్పతిమతిప్రౌధిమ
               నెరసించు నెవ్వనివిశితబుద్ధి