ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

85

గొంచెము వమ్ముచేసిన, భవిష్యత్సంతతులవారు మనలను దిట్టుకొందురు. కేవలము మనలను మనమే పొగడికొనుచుఁ గూర్చొనలేము. మన కున్న సహజసంపదలపై నాధిపత్యము సంపాదించు కొనవలయును. లేకపోయిన మనముఖమునకుఁ దారిద్ర్యమే గతి కాఁగలదు.

ఇంతకు మనమందరము నేఁ డెదుర్కొనవలసిన క్లిష్ట సమస్య యేమిటి? ఇండియాలో శాంతి భద్రతల సంరంక్షణ కాదా ? కొంచెము కాలూని నిలుచుటకు మన కవకాశము కలిగినది. ఇప్పుడు మన పునాదులను మనము గట్టిపఱచుకో వలయును. పరస్పరప్రేమ, విశ్వాసములవల్ల మాత్రమే యిండియా యఖండమై సుదృఢముగా వర్ధిల్లఁగలదు.

ఆతరువాత మన మెదుర్కోవలసిన మఱియొక మహా క్లిష్ట సమస్య ఇన్ ఫ్లేషన్. మనకుఁ జాలినంతగా మనము వేనిని మన దేశములో నుత్పత్తి చేయుటలేదు. అందుకోసము బోలెడు సొమ్ముపోసి విదేశములనుండి దిగుమతి చేసుకోవలసి యున్నది. మనము వాని రవాణాకోసమే యనేక కోట్ల రూపాయలు పోయవలసి వచ్చుచున్నది. మనము కాస్త వివేకముతోఁ గ్రొత్త నౌకలను నిర్మించినను లేక ఖరీదు చేసినను నీ డబ్బంతయు నాదా యయ్యెడిదికాదా! మనకుఁ జాలినంత గుడ్డను మన ముత్పత్తి చేయుటలేదు. మనకుఁ దినఁదిండి, కట్ట బట్ట కావలసినంత యుండిన శాంతిగా బ్రతుకవచ్చును. తక్కిన యిబ్బందుల వేనినయినఁ దేలికగా భరించవచ్చును. ఒకవేళ మనము చాలినంత యుత్పత్తిని గొనసాగించినను దాని నందఱకుఁ బంచుటలో నెన్నో చిక్కు లేర్పడుచున్నవి. మనము