ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

వల్లభాయిపటేల్

వినాశాత్మక పద్ధతి. నేటి కల్లోల ప్రపంచమునకు గాంధీ విధానమే శాంతి సామరస్యములను మార్చఁగలదు.

సమైక్య, పటిష్ఠ భారతనిర్మాణ సాధనము

"దేశవిభజన జరిగిన వెంటనే యిండియా నెన్నో క్లిష్ట పరిస్థితు లెదుర్కొన్నవి. ఇండియా ప్రతిష్ఠకుఁ గళంకము కలిగినది. కాశ్మీర్ సమస్యకంటె హైదరాబాదు సమస్య చాల విషమముగాఁ బరిణమించినది. దానిమూలమున దేశములోని వాతావరణమంతయు మారిపోవుటయే దీనికిఁ గారణము. విద్వేషములు ప్రబలిపోయినవి. గాంధీజీహత్య జరిగినది. ఈ విషాద సంఘటనమూలముగా మనకుఁగలిగినహాని యింతయు నంతయుఁ గాదు. ఆయన సలహాలు, మార్గదర్శకత్వము, నన్నిటికంటె మించి యాయని యాశీర్బలము మన కత్యవసరమైన తరుణములో మన మధ్యనుండి యాయన తిరోహితుఁడైనాఁడు. కాని యాయన దృష్ట్యా, ప్రపంచదృష్ట్యా చూచిన నాయననిర్యాణ మొకవిధముగా లాభదాయకమే యని చెప్పవలయును. నా మట్టుకు నే నట్టి మరణమునే కోరుచున్నాను. అయినప్పటికి నా దుష్కృత్యమునకుఁ బాల్పడ్డవారుమాత్రము పశ్చాత్తాపము చెందకతప్పదు. ఈ ప్రమాదము లన్నిటిని మనము గడచి బయటఁబడితిమి. ఈ ప్రమాదములను వీలైనంతవఱకు స్వప్రయోజనానుగుణముగా మనము వినియోగించుకొన్నాము. ఇండియాకు శాంతి సామరస్యములను జేకూర్చితిమి. గాంధీజీ నిర్యాణానంతరము దేశములోఁ గలిగిన పరిణామమువల్లనే హైద్రాబాద్‌పైఁ బోలీసుచర్యల సందర్భములో శాంతిభద్రత