ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

77

యాలోఁ గారాగారవాసము నయమని యాయన తలపోయు చుండఁగలఁడని నా విశ్వాసము.

"ఇదే తరుణములో వారు కాశ్మీరులో గూడ జోక్యము చేసికొన్నారు. ఆపోరాట మింకను సాగుచునేయున్నది. కొండజాతులప్రాంతాలలోఁ బాకిస్థాన్‌కు విషమపరిస్థితు లేర్పడినవి. పొగడ్తలవల్ల నేమి, యొత్తిడివల్ల నేమి, యా సమస్యల బరిష్కరింపఁజూచిన పాకిస్థాన్‌నాయకులు, చివరకు వీరిని గాశ్మీరముపై నుసికొల్పిరి. ముస్లిము లత్యధిక సంఖ్యాకులుగాఁ గల కాశ్మీర్ సంస్థానము విధిగా బాకిస్థాన్‌లోఁ జేరిపోవలెనని కొందరభిప్రాయపడుచున్నారు. అసలు మనము కాశ్మీరులో నెందుకున్నామా యని వా రాశ్చర్యపడుచున్నారు.

"దీనికి సమాధానము చెప్పుట యతిసులభము. కాశ్మీర్ ప్రజలు మన తోడ్పాటును గోరుచున్నారు. కనుకనే మన మిక్కడకు వెళ్ళితిమి.

"కాశ్మీర్ ప్రజల కిష్టములేనిపక్షములో మనమక్కడ నొక్కక్షణముకూడ నుండఁబోము. కాశ్మీర్ యుద్ధమింకను సాగుచునేయున్నది. ఆ యుద్ధములోఁ దన కేమియు జోక్యము లేదని పాకిస్థాన్ ప్రభుత్వము ముందు బుకాయించినది. తమ సైనికు లక్కడఁ బోరు సల్పుచున్నమాట వాస్తవమేనని, యిప్పుడది యంగీకరించుచున్నది.

"కాశ్మీర్‌లో దాని ప్రవర్తనకుఁ బాకిస్థాన్ పరువుప్రతిష్ఠలు మంటఁ గలిసెనని చెప్పవచ్చును. కాని హైదరాబాద్ సమస్య నవకాశముగాఁ దీసికొని తన పబ్బము గడుపుకొంద