ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

వల్లభాయిపటేల్

శక్తికి గౌరవనీరాజనము సమర్పింపఁబడినది. ఇది - 1928లో. ఆ శుభవార్త రాఁగానే నే నెంతయానందించితినో మాటలతోఁ జెప్పలేను. ఆనాడు సర్దార్‌జికూడ నావలె నొక కర్షక మాత్రుఁడు. కాని యాధునిక కర్షకలోకముకూడ నొక యఖండప్రతిభావిలసితనాయకుని. దేశ రాజకీయరంగములోనికిఁ బంపఁగలదని, యా నాయకుఁడు బ్రిటిషుప్రభుత్వముతో ముఖాముఖిని బలాబలాలు చూడఁగలఁడని. విజయసిద్ధినందఁగలఁడని సర్దార్‌జీ ఋజువు చేసినాఁడు. కిసాన్ సర్దార్ నాగురుపీఠ మని భావించితిని. సర్దార్ సామ్రాజ్యవాద వ్యతిరేకామరభావమూర్తిగాఁ బ్రతి భారతీయ విప్లవకారునికిఁ గన్పించును. కిసాన్ విప్లవకారులలో నాయన మేటి. ఏవో స్వల్పప్రయోజనముల నిమిత్తముతోఁగాక, స్వార్థ కాంక్షాసిద్ధి నాశించికాక, ప్రజాబాహుళ్యసౌభాగ్యసిద్ధికై యధికారమును వాంఛించు కిసాన్ మనస్తత్వమును సర్దార్ తనలో మూర్తీభవింపఁ జేసుకోఁగలిగినాఁడు. వివిధ కాంగ్రెసు రాష్ట్రములలోను జరిగిన రైతుఋణబాధనివారణపు చట్టాలలో నాయన యాకాంక్ష ప్రతిబింబితమైనది. ప్రజాబాహుళ్యమును సేవించఁగోరు తనమార్గమునకు ధనికవర్గము లడ్డువచ్చుట జరుగఁగా భయరహితముగా వారి నెదిరించినాఁడు. కిసాన్ విప్లవకారులలో నాదిపురుషుఁడని మన మాయనను బ్రస్తుతించుచున్నా"మని ప్రశంసించినాఁ డాచార్యరంగా.

'గాంధీజీ వశంవదుఁడు'

"సర్దారు కాయన జన్మదినోత్సవ సందర్భములో నా హృదయపూర్వకాభివందనములు. ఆయన పరిచయభాగ్యము