ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

69

జిక్కుపడి యాయన యేనాఁడుకూడఁ దర్జనభర్జన పడలేదు. తాత్కాలికపు టేర్పాటులద్వారా ప్రజాస్వామిక స్వాతంత్ర్యము సిద్ధించఁగలదని కొందఱు తక్కువతరగతివారభిప్రాయ పడుచున్నకాలములో "క్విట్ ఇండియా" తీర్మానమును దృష్టిలోనుంచుకొని 1945 జూన్ 30 వ తేదీన సర్దా రిట్లు సింహగర్జన చేసినాఁడు.

"ఆ తీర్మానములో నొక్క యక్షరమును మార్చుటకు వీలులేదు. మభ్యపఱచుటకు వీలులేదు. దాని తరువాత నొక మెట్టనుచు నుండిన నది "క్విట్ ఆసియా."

కర్మవీరుని వాక్కులవి. భారత జాతీయ కాంగ్రెసు భావ్యధ్యక్షుని గర్జన యది. బార్డోలీలో, గుజరాత్‌లో, చారిత్రకప్రసిద్ధోద్యమములను నడిపి, తిరిగి చరిత్రలోఁ బ్రధాన ఘట్టమును రచించఁగల స్పష్టాభిభాషణ మది.

సర్దా రెప్పుడుకూడఁ గర్మవీరుడు. వాగడంబరుఁడు కాదు. ఆయన సృజించినది రెండే మాటలు - "క్విట్ ఆసియా" ఆ రెండు మాటలలోనే సర్దార్ పరిపూర్ణముగాఁ బ్రతిబింబించు చున్నాఁడు. భారతదేశమునకు, నాసియాకు నదే యాదేశము. నాయకుని యాదేశమైనది, స్వాతంత్ర్యవీరుల పురోగమనము ప్రారంభమైనది. జైహింద్ ! జై ఆసియా !" అని కర్మవీరుని ధీరతను జాటినారు శరత్ చంద్రబోసు.

"మనపెద్దరైతు"

బార్డోలీ కర్షకలోకము తమ నాయకుఁడైన వల్లభాయిని "సర్దార్ పటేల్" అని సంబోధించి గౌరవించిన పర్వదినమునాఁ డాధునికభారతకర్షకలోకములో నంతర్లీనమైయున్న విప్లవ