ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

67

నెగ్గుట కష్ట మనుకొనువారిది పొరపాటు. ఆయనలో బ్రేమ మూర్తియైన స్త్రీవాత్సల్యము మూర్తీభవించినది. చూపులకుఁ గర్కశుడు. కాని లోపలనున్నది యావేశపూరితహృదయము, శ్రమనెఱుఁగని కార్యదీక్ష.

ఆయన యుద్దండుఁడు - నియంతవలెఁగాక, తల్లివలె. ప్రపంచములో నాయన యనుభవించిన సుఖము స్వల్పము. తనను గుఱించిన యాలోచనయే యాయనకు లేదు. అన్యాయము నేమాత్రము సహించఁడు. కనుకనే యాయన నన్యాయము చేయఁజూచువారి కాయన ముక్కోపిగాఁగనుపించును. అది క్రోధముకాదు - ఆత్మవిశ్వాసము.

"ఆయన మంత్రములు చదువఁడు కాని, దైవభీతి కలవాఁడు. పెక్కుమందికంటె శిష్టాచార సంపన్నుఁ" డన్నారు రాజాజీ.

"భారత సర్దార్"

"జైలునుంచి బయటికి రాఁగానే 'బార్డోలి సర్దార్‌'ను 'భారత సర్దార్‌' అని నేను సంబోధించితిని. క్షణికావేశములో నే నట్లనియుండలేదు. నాలుగు సంవత్సరములపాటు నేను దీవ్రముగాఁ జేసిన యాలోచన ఫలితమది.

1942 ఏప్రియల్ 27 వ తేదీని అలహాబాదులో జరిగిన వర్కింగుకమిటీ సమావేశములో రాజేన్‌బాబుతో, ఆచార్య కృపలానితోఁగలిసి యాయన ప్రకటించిన వైఖరిని తరువాత నే నెన్నో పర్యాయములు సంస్మరించితిని. "క్విట్ ఇండియా"యని గాంధీజీ సిద్ధపఱచిన ముసాయిదా తీర్మాన