ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

వల్లభాయిపటేల్

సంవత్సరములనుదాటి బ్రతుకుట నా యభిమతముకాదు. స్వర్గములో గాంధీజీ సహచరులలో నుండఁగోరుచున్నాను."

భారతదేశము నలుమూలలనుండి వేలాది శుభసందేశములు వచ్చినవి. నాయకులుసైతము తమ 'కర్మవీరుని'స్థితప్రజ్ఞతను గొనియాడుచు దమశుభాకాంక్షలు తెలియజేసిరి. పటేల్ జన్మదినోత్సవ సందర్భములో సందేశ మియ్యవలసినదని బొంబాయికాంగ్రెసువారు మహాత్మగాంధిని గోరఁగా "సర్దార్ నా కొడుకువంటివాఁడు. కొడుకు పుట్టినరోజు పండుగనాఁ డభినందించు లాంఛనమును దండ్రి వేఱుగఁ బాటించవలయునా" యన్నారు.

"నా అన్నగారు"

గత 25 సంవత్సరములకుఁబైగా సర్దార్ వల్లభాయి పటేల్ సన్నిహితపరిచయభాగ్యము నాకు లభించినది. కేవల మొక మార్గదర్శకుఁడేగాక, నాయకుఁడేగాక, యాయన నాకన్నగారివలె నున్నాఁడుకూడ.

ఆయనకు వయస్సుమళ్ళినది. ఆరోగ్యముచెడినది. కాని స్వాతంత్ర్యపిపాసాగ్ని యీషణ్మాత్రమైనఁ జల్లార లేదు. గాంధీజీ పెద్దవాడైపోయినాఁడని తానుగూడఁ బెద్దవాఁడనై పోవుచున్నానని, జాతీయాభ్యుదయభారమును యువకులుపంచుకోవలయునని యాయన యొకపర్యాయము యువకులకుఁ జెప్పుచుండఁగా విన్నాను. గాంధీజీయుఁ దానును సజీవులైయుండఁగానే తమ జాతీయాభ్యుదయ కృషిఫలితమును జూడఁగల్గుటకై యువకులు సర్వశక్తుల నశేషత్యాగములను జాతీయస్వాతంత్ర్యమునకై