ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

వల్లభాయిపటేల్

ఆ వృద్ధపితను వెన్నంటి కాచి సర్వ సపర్యలు చేయు తనయ లేని లోప మా తరు వీవిధముగాఁ దీర్చు చున్నది గాఁబోలు.

పటేల్‌జీ హాస్యమునకుఁ బేరుపొందినవాఁడు. వట్టి హాస్యమేకాదు. ఆ చక్కలిగింతలోఁ జుఱుకుపోటులుకూడ నుండును.

ఆచార్య కృపలానీకూడ హాస్యరసపు జల్లులు కురిపించునుగాని దానిలో సున్నితము శూన్యము. శూలములవలె నుండును. ఆయన పలుకులు ములుకులు. ఆ పలుకులలో నాయన ప్రత్యేకతఁ బొందినాఁడు.

నెహ్రూజీ తోటమాలిగా నెక్కువ కాలము గడుపుచు నెంతో యానందము పొందుచుండువాఁడు. ఆ రసజ్ఞుఁడై జైలధికారుల నడుగకుండ సొంతసొమ్ముతో రకరకాల పూలవిత్తనములు తెప్పించి కోటయావరణలో సగముభాగము నయనా నందకరముగా, నందనోద్యానవనముగా, మార్చి వేసినాఁడు. మడులు త్రవ్వుట, కుదురులుచేయుట మొదలగు కుతూహలపుఁ బనులన్నియు స్వయముగాఁ బ్రతిరోజు చేయుచుండువాఁడు.

నెహ్రూజీ గ్రంథావలోకనములోను, గ్రంథరచనలోను గాలము గడపిన సంగతి సర్వజనవిదితము.

ఆమహామహుఁడు కారాగృహవాసము చేయకపోయినఁ బ్రపంచమున కమూల్యమైన యా సాహిత్యము నిచ్చుట కవకాశముండునా? మేలుకీళ్లు కలసియుండునుగదా!

పూర్వము తిలక్‌గారుకూడ మాండలే చెఱసాలలో గీతారహస్యమును రచించినాఁడు. మన పట్టాభిగారుకూడ