ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

వల్లభాయిపటేల్

నాయత్తపఱచుచుండెను. 1930 మార్చి 7 వ తేదీ నాయన "రాస" గ్రామము చేరెను.

అక్కడ నాయన యుపన్యాసమునకై ప్రయత్నము చేయబడెను. ఇంతలోనే జిల్లా మేజిస్ట్రేటు ఆర్డ రందఁజేయఁబడెను. అందులో నాయన యెట్టి సభలలోను, సమావేశములలోను బాల్గొనఁగూడదని తెలియఁజేయఁబడెను. ఈస్వాతంత్ర్య యోధుఁ డా పరప్రభుత్వాజ్ఞను బాటించునా? అందుచే నరెష్టు చెయ్యఁబడి మూడుమాసములుఖైదు, నైదువందల రూపాయల జరిమానా విధింపఁబడెను. ఇదియే యాయన ప్రథమకారాగార ప్రవేశము.

జైలులో నాయన బహుబాధలు పడవలసివచ్చెను. 15 పౌనులు తగ్గెను. జూన్ 16 వ తారీఖునఁ గటకటాలనుండి బయటఁబడెను. ఈ సమయములో సత్యాగ్రహము బహుతీవ్రముగా సాగుచుండెను. మోతీలాల్ నెహ్రూ అరెష్టుకాఁబడినప్పు డాయన వల్లభాయిని గాంగ్రెసుకుఁ దాత్కాలిక సభాధ్యక్షుఁడుగా నియమించెను. ఈ సమయములోనే దర్శన యుప్పు కొఠారులపై సత్యాగ్రహులు సాహసోపేతముగా దాడి చేయుచుండిరి. వేలాది స్త్రీ పురుష స్వయంసేవకులు లాఠీ చార్జీలకు గుఱియవుచుఁగూడ నద్భుతమైన శాంతిని బ్రదర్శించు చుండిరి. ఆగష్టు 1 వ తారీఖున లోకమాన్యతిలక్ వార్షికోత్సవము బొంబాయిలో నద్భుతముగా జరుపుట కూరేగింపు సాగెను. వల్లభాయి, మాలవ్య, డాక్టర్ హార్డికర్ మొదలగు ముఖ్యనాయకులు ముందు నడచుచుండిరి. విక్టోరియా టెర్మినస్ సమీపమునకు రాఁగానే యూరేగింపు శాసనవిరుద్ధమైనదని