ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

వల్లభాయిపటేల్

గాంధీజీని గండ్లుమూసికొని యనుసరింతు నన్నాఁడు. అది మహాత్మునియం దాయన భక్తివిశ్వాసములకు నిదర్శనము. అయినను బటేలుకు స్వకీయాభిప్రాయము, యుక్తాయుక్త విచక్షణ లేవని తలఁచరాదు. గాంధిజీ యాజ్ఞ లన్నిటిని శిరసావహించునని తలఁపరాదు. ఎదురుతిరిగిన ఘట్టాలు లేక పోలేదు. భిన్నాభిప్రాయములను వెలిబుచ్చుటయుఁ గలదు. గాంధిజీ పావలాచందాబదులు నూ లీయవలయునని ప్రతిపాదించినప్పు "డిఁకఁదమరు తప్పుకొన్న బాగుగనుండు"నని నిర్ముఖమోటమిగా నన్నాఁడు.

గాంధీజీ యహింసావాది. యుద్ధమునకు వ్యత్రిరేకి. అయినను బటేలు 1944 లో మహాత్ముని యభిప్రాయమునకు భిన్నముగా జాతీయప్రభుత్వ మేర్పాటైన, యుద్ధమునకు సహాయము చేయుదుమని చెప్పెను.

గాంధీజీ యెదుట నరమర లేకుండ సరోజినివలె హాస్యమాడుట కాయన కే గుండెగలదు. పైగా నా హాస్యము నందరకన్న నాబోసినోటి తాతయే యధికముగా నాహ్వానించువాఁడు.

గురువును మించిన శిష్యుఁడు. గాంధీజీ "క్విట్‌ఇండియా" తీర్మానము ప్రతిపాదింపఁ దాను 'క్విట్ ఏషియా' తీర్మానము ప్రతిపాదించిన ప్రఖ్యాతుఁడు పటేలు.

గాంధిజీ యాదర్శమును సూచింపఁ బటేలు సాధన మార్గమును జూపించువాఁడు. నడుముకట్టుకొని కార్యరంగములోఁ గర్మవీరుఁడై విహరించువాఁడు.

గాంధీజీతో నప్పుడప్పుడు స్వాతంత్ర్యసంపాదనలో నభిప్రాయభేదము ప్రకటించినను గాంధీజీని కాంగ్రెసు సంఘము