పుట:2015.329863.Vallabaipatel.pdf/157

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

వల్లభాయిపటేల్

నిరభిమానముగా నాయన వ్రాసెను. అది యితరుల కసంభవము. మోహరహితుఁడైన యాధ్యాత్మికసాధకునకే యది సంభవము. అది యాయనపధము. వల్లభాయి యొక గొప్ప స్వార్థత్యాగియైన వీరపురుషునివలె స్వవిషయములో మౌనము దాల్చును. ఈమౌనముకూడ విసుగుదలతోఁ గూడినదే. గాంధీజీవిరోధితోఁబోరాడును. కాని విరోధియనిభావించికాదు. అతని నాశనము చేయుటకుఁగాదు; ఆతనిలో మార్పుఁదెచ్చుటకు; నతనిని జెడుమార్గమునుండి తప్పించుటకును; యుద్ధసమయములోఁగూడ విరోధి కల్యాణము నాయన ధ్యానించును. ఈ సాధకుని యంతఃకరణములో నిండి నిబిడీకృతమైయున్న యుదారతచే నాయనకు సహజముగాశత్రువులేఁడు. వల్లభాయి యుదారత వీరోచితమైనది. అతఁడు చాటుమాటుననుండి శత్రుసంహారముచేయ నుంకించఁడు. శత్రుసమ్ముఖముననే నిలఁబడి నిప్పులు గ్రక్కు కన్నులఁ జూచుచు నతనిని నాశనము చేయఁగోరును. శత్రుపరాజయముచే నుప్పొంగును. గాంధీజీ సత్యాగ్రహి. విరోధికిఁ దన కార్యక్రమమును బ్రప్రథమముననే సూచించును.

వల్లభాయి తా నెవరికి శత్రువో, మిత్రుఁడో సూచన చేయఁడు. ఆయన కార్యక్రమము మనము కనుగొనఁజాలము. కార్యానంతరమే కనుగొనఁగలము.

భేదములు

ఇంతేగాదు. మగన్‌లాల్‌జీ చక్కగా వా రిద్దరనుగుఱించి యిట్లు వివరించినాడు. "మహాత్మాజీ యతి సామాన్యమానవునియొక్క ప్రశ్నకుఁగూడ జవాబుచెప్పును. అతని కుతూ