పుట:2015.329863.Vallabaipatel.pdf/148

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

141

గ్రహించి యిప్పుడు కలసి పనిచేయవచ్చును. వారి విభేదముల తీవ్రత వారి కలయిక నడ్డుపెట్టజాలదు.

వాస్తవమునకు, వారివిభేదములను గుఱించి మాట్లాడుచు వారిద్దరిమధ్యఁగలసామ్యమును, వారిద్దఱను దగ్గరకులాగుచున్న పరిస్థితులను బ్రజలు గ్రహింపకున్నారు. దేశములోని యత్యవసరపరిస్థితియేగాక గాంధీజీపట్ల శ్రద్ధాభక్తులుకూడ వారి కలయిక కొక ప్రబలకారణము. రాజకీయముగ, నాధ్యాత్మికముగ వా రాయన కుటుంబమునకుఁ జెందినవారు. నెహ్రూ సోషలిస్టు దృక్పథము గాంధీజీ పలుకుబడివలనఁ జాలవఱకు మారినది. ఇద్దరు దశాబ్దములనుండి కలసి పనిచేయుట కలవాటుపడియుండిరి. ఒకరితప్పు లొకరికిఁ బూర్తిగాఁ దెలియును. బహుశః యనేక పర్యాయము లొకరి నొకరు తిట్టుకొనియుండ వచ్చును. కాని దానిని విస్మరించి యైక్యముతో వారు వ్యవహరించఁగలరు.

మహాత్మునివంటి సంస్థలు

తమ పలుకుబడి ప్రాబల్యమువలన నెహ్రూ పటే ళ్ళిద్దరు గాంధీజీవంటి సంస్థలే యైనారు. వారు కేవల మగ్ర నాయకులు మాత్రమేకాదు. ప్రస్తుత కల్లోల వాతావరణములోఁ బ్రజ లొక్కొక్కప్పుడు ప్రభుత్వ విధానములను నొక్కొక్కప్పుడు కాంగ్రెసు హైకమాండు చర్యలను నిరసించినను, జివరకు వీ రిద్దరినిజూచియే, ప్రతి విషయము నంగీకరించుచున్నారు. నెహ్రూ పటేలులతర్వాత నే వ్యక్తిగాని, చివరకుఁ గాంగ్రెసుగాని యిటువంటి సహనదృష్టితోఁ బరిశీ