పుట:2015.329863.Vallabaipatel.pdf/117

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

వల్లభాయిపటేల్

గొందరు దేశద్రోహులు చేయుచున్న దుష్కార్యములను గుఱించి మీరట్‌లో వల్లభాయి వివరించెను. దీనిని బురస్కరించుకొని యాయన మహమ్మదీయ ద్వేషి యని, వారిపై హిందువులను బహిరంగముగ రెచ్చగొట్టుచున్నాఁడని గాంధీజీయొద్దఁ గొందరు ఫిర్యాదుచేసిరి. దేశమునఁ జెల రేగిన రక్తపాతమునకు వ్యధితుఁడై గాంధీజీ ఢిల్లీలో నుపవాసవ్రతము పూనెను! ఆ యుపవాస దీక్షలో మహాత్ముఁ డొకనాఁ డిట్లు పలికెను.

"సర్దారు వల్ల భాయికి మహమ్మదీయుల యెడల విద్వేషమునట్లు పలువురు మహమ్మదీయమిత్రులు నాతోఁ బలికిరి. నా హృదయాంతరమునఁ జెప్పరాని యావేదన జనించినది. దానిని నాలోనే యణచివేసికొని వారు చెప్పినదంతయు వింటిని. పండిత నెహ్రూను నన్నుఁ గొండంతలుగాఁ గొనియాడుచున్న మీకు సర్దారు వల్లభాయిని మానుండి విడఁదీయుట యుచితము గాదు. అందఱను సమాదరించగల యుదారహృదయుఁడగు వల్లభాయి తలవని తలంపుగా నొక్కొకపు డొరులమనస్సు నొప్పి పడునట్లు తూలనాడుట గలదు. అతఁడు నా సహచరుఁడని, యావజ్జీవమిత్రుఁడని నే నాతనిఁ బూసికొనివచ్చుట లేదు."

"ఏ యహింసావిధానమున మన మిదివరలో విజయము సాధింపఁగలిగితిమో, యా యహింసావిధానమును బ్రభుత్వాధికారము హస్తగతమైన పిదప నవలంబింపలేమని యతఁడు గ్రహించెను. నేను నా సహచరులు దేని నహింసావిధానమని నిర్వచించు చుంటిమో యది నికరమగు నహింసావిధానము కాదనియు సాత్వికమగు నిరోధమున కనుకరణము మాత్రమే యనియుఁ గ్రమముగా గ్రహించితిమి. దేశపరిపాలనకుఁ గడంగిన