పుట:2015.329863.Vallabaipatel.pdf/116

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

109

ఉపప్రధాని

"పరిపాలనలోఁ బాల్గొనుటకు బుద్ధిమంతులు నిరాకరించిన దుష్పరిపాలనక్రింద జీవితము గడుపు శిక్ష వారనుభవించవలసి యుండును."

-ప్లేటో.

తాత్కాలిక ప్రభుత్వానంతరము వివిధరాష్ట్ర సంస్థాన ప్రతినిధులతో రాజ్యాంగ పరిష త్తేర్పడవలసియుండెను. కాని దీనిలోఁ బాల్గొనుటకు ముస్లింలీ గంగీకరింపదాయెను. ప్రత్యల్ప విషయమునకు నది వ్యతిరేకించుచుండెను. ఈ లీగుపరిస్థితిని గ్రహించి పటే లెవరు సహకరించినను, సహకరించక పోయినను బరిషత్సమావేశ మాగఁబోదని ఘంటాపథముగఁ జెప్పెను.

ఆయన చెప్పిన చొప్పుననే 1946 డిశంబరు 9 వ తేదీ ననుకొన్నట్లు రాజేంద్రప్రసా దధ్యక్షుఁడుగ ముస్లింలీగు సభ్యులు హాజరు కాకపోయినను రాజ్యాంగపరిషత్తు ప్రారంభమాయెను.

ముస్లింలీగు నెహ్రూ ప్రభుత్వములోఁ జేరి యాంగ్లేయోద్యోగులతోఁ గలసి ప్రతిష్టంభన కావించుచుండెను. అటుల ప్రభుత్వముతోఁగలసిరాక యిటుల రాజ్యాంగపరిషత్తులోఁ బాల్గొనక ద్విజాతిసిద్ధాంతమును బ్రచారముచేసి యా సిద్ధాంత సాఫల్యమునకై జిన్నాగారి యధ్యక్షతను 'డైరక్టుయాక్షన్‌' అనగాఁ బ్రత్యక్ష చర్య యారంభించెను. ఇందువల్ల దేశమంతట హిందూ మహమ్మదీయ కలహములు చెల రేగెను. పంజాబు, బెంగాలు, ప్రాంతములలో నీరక్త పాతము మఱింత పెచ్చు పెరిగెను. భారత స్వాతంత్ర్యసంపాదనకు భిన్నముగఁ