పుట:2015.329863.Vallabaipatel.pdf/103

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

వల్లభాయిపటేల్

నేకఖండమైన భారతదేశములోని సువిశాల ప్రాంతము నేక ఛత్రమక్రిందికిఁ దీసికొని రాఁగలుగుట యిదే మొదటిసారి. పాలనారీత్యా జరుగఁదగు పునర్నిర్మాణకార్యకగాని మింక వెనువెంటనే ప్రారంభము కావలసియున్నది. మన మార్థిక సమస్య లన్నిటినిఁ గృతనిశ్చయముతో ధైర్యసాహసములతో సర్వుల సహకారసుహృద్భావముతోఁ బరిష్కరించవలసి యున్నది.

"విదేశములతో మనకుఁగల సుహృద్భావ సంబంధ బాంధవ్యములను మఱింత దృఢతరము చేసికోవలసియున్నది. ఇఁక నాంతరంగికవ్యవహారములలో మతసంబంధములేని ప్రజాస్వామికలక్ష్యమున కనుగుణముగా సహన, సహకార, సుహృద్భావములతో మనము మెలఁగవలసియున్నది. ప్రభుత్వముపట్ల తమకుఁగల బాధ్యతలను బ్రతివారు గ్రహించవలయును. దేశము పట్ల ప్రతివారు భక్తివిశ్వాసములు కలిగియుండవలయును. రెండు ప్రభుత్వములపట్ల భక్తి విధేయతలు కలిగియుండువారి కిండియాలో స్థానములేదు. ఆంతరంగిక సమస్యలను, నై దేశికసమస్యలను బరిష్కరించుటకై ప్రతిపౌరుఁడు సహకరించవలెనని కోరుటకుఁ బ్రభుత్వమునకు హక్కున్నది. అందువల్ల స్వాతంత్ర్యముపొందిన యీ రెండు సంవత్సరములలో మన మీదఁబడిన బాధ్యతలన్నిటిని బూర్తిగా నిర్వర్తింతము. మన మాతృదేశ ప్రతిష్ఠను బెంచుటకు, మన మాతృదేశ శ్రేయస్సును బరిరక్షించుకొనుటకు మనమందఱము మనకృషిని నెరవేర్తము. ఇంతకంటె నుత్తమమైన యాదర్శము నెవ్వరు నారాధించఁజాలరు. ఇంతకంటెఁ బవిత్రమైన బాధ్యత నెవ్వరు నిర్వర్తించఁజాలరు."