పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/76

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

73

కడ నోడించుటయు, మన్నె రాజులను తిరుపతినుండి బాహు విక్రమంబునఁ బాఱఁదోలుటయు, చెంగలుపట్టు నాక్రమించిన రీతియు, పాలెంబుకోటబహిర్భాగమున యతిరాజుపై గవిసి చూపిన శౌర్యపటిమయు, అంతకుముందె జగ్గరాజుమున్నగు ప్రముఖులను తిరుచనాపల్లిదొరను పీచమడంచుటయు వర్ణించెను.

ఇతఁడు ఉత్తరమునుండి దక్షిణదిశకు శత్రుసైన్యముల నడుమనుండి యుద్ధములుసేయుచు విజయములను గాంచుచు రఘునాథరాయనిఁ గలిసికొనుటకై పోవుచుండుటయు నిపుణముగ దెలిపెను. ఈమహావీరుఁడు తనపట్ల మహాద్వేషముతో నున్నరఘునాధనాయనితోఁ గలిసికొన్న యెడల నగ్నికి వాయువు తోడ్పడినటుల రామదేవరాయని పక్షము వారు విజృంభించి తప్పక రామదేవరాయనికిఁ బట్టముఁ గట్టఁగల రని భయబడుచు నీతని జగ్గరాయ లడ్డగింపుచు వచ్చెను. పైన నీవీరునిచే చేటొందిన యతిరాజు జగ్గరాజునకు దాయాది. ఇతఁడు రామదేవరాయలు పట్టాభిషిక్తుఁడు గాకుండ నడ్డుపెట్టిన ద్రోహులపక్షముననుండి యుద్ధములు చేసి పలాయనుఁ డయ్యును రామదేవరాయలు పట్టాభిషిక్తుఁ డయినవెనుక వానికి తనకుమార్తె కొండమ్మ నిచ్చి వివాహముఁ జేయవలసిన వాఁ డయ్యెను.

ఈ విషయము తుండీరమండలాధిపతి యగుకృష్ణప్పనాయని, వీరవేంకటపతిరాయ లీతఁడు సామ్రాజ్యమునకు