పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/66

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

63

రంగముపై నడుచుట సంభవించి భూమిపై పట్టతిమాత్రముగా నుండుటచేత నాసొరంగములో వారిపై బడుట సంభవించెను. అయ్యది కత్తులు దూయుట కనువగు ప్రదేశము కాదు. రాయలను సురక్షితస్థానమునకు త్వరలోఁ గొనిపోవుటకు సాధ్యము గాదు. ఈ కావలివాని మొఱ్ఱల నాలకించి తక్కిన కావలివాండ్రందఱు నొక్కపెట్టునఁ బఱువెత్తుకొని వచ్చి అంగవస్త్రము మాత్రము గలిగి దేహమంతయు దుమ్ముతోఁ గప్పఁబడి మోకాళ్ళుకొట్టుకొనిపోయి రక్తము గారు చుండ రంగరాయలను జగ్గరాయలకడకు నీడ్చికొని పోయిరి. అతఁడు కోపము పట్టఁ బగ్గములులేక యువ్వెత్తువ లేఁచి మండిపడుచు నాతనికి ప్రత్యేకముగాఁ జీకటికొట్టుకైదు విధించి చంద్రగిరిదుర్గమునకుఁ బంపించెను. అటుపిమ్మట వాని భార్యను, బిడ్డలను నచటికే పంపెను. వీరిప్రయత్నము విఫలమై రంగరాయనిబ్రతుకు మఱింత దుర్భరమైపోయినందుకు ఖేదపడుచు యాచమనాయఁడు ధైర్యసాహసముల ప్రసిద్ధిగాంచి విశ్వాసపాత్రుఁడుగా నున్న మఱియొక యువకుని రప్పించి ఓయీ! రంగరాయలు చంద్రగిరిదుర్గమున నున్నవాఁడని వినుచున్నాను. ఇపు డాదుర్గమును సంరంక్షించుచున్న భటుల సంఖ్య తక్కువగా నున్నట్లు తెలియుచున్నది. మఱియు జగ్గరాయలు తనపక్షమును బలపఱచుకొనుట కై మండలాధిపతులకడకుఁ బోయియున్నాఁ డని వినుచున్నాను. ఇచటి నుండి నాసైన్యములతో నేను కదలితినా జగ్గ