పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/65

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

వెలుగోటి యాచమనాయఁడు

బ్రవేశించినపుడు రంగరాయలు వారినిగాంచి వారలను జగ్గరాయలబటులుగాఁ దలంచి తన్నుఁ జంపుటకు వచ్చినవా రని భావించి భయపడియు వీరపురుషోచిత మైనధైర్యముతో నుండి నిశ్చేష్ఠితుఁ డయ్యెను. అంత వార లాతనికి సాష్టాంగ నమస్కృతులు గావించిరి. వారి నాయకుఁ డగు నొకయువకుఁడు యాచమనాయకుఁ డిచ్చిన ------కుజాబునుఁ దీసి యాతని కిచ్చెను.

అంతట తత్తరముతోఁ రంగరాయ లాజాబునుఁ జదువుకొని యాచమనాయకుని భక్తివిశ్వాసముల కబ్బురపడుచుఁ దన దురవస్థను దలపోసికొనునప్పుడు లోపలినుండి యుబుకుకొని వచ్చెడు దుఃఖప్రవాహము నాపుకొని 'ఇటువంటి భక్తివిశ్వాసములతోఁ గూడికొని ధైర్యసాహసములఁ జూఁపుచు నన్నుఁ జెఱనుండి తప్పించుటకుఁ జూపిన యీ మార్గము నుల్లంఘించుట తనవంటివానికి యుక్తము గా' దని పలికి భార్యకును, బిడ్డలకును జెప్పి తాను కట్టుకొనియున్న దుస్తులను విసర్జించి యొక చిన్న యంగవస్త్రమును జుట్టఁ బెట్టుకొని వారల వెనుక సొరంగములోనికి దిగి సొరంగము మార్గమున బయలు వెడలెను. దుమ్మును, ఱాళ్లును పైఁ బడుచుండ చేతులు, మోకాళ్లును క్రిందనాన్చుకొని యొక్కపలుకైన బలుకకుండ నూపిరి విడుచుట కష్టముగా నున్నను సహించి చాలదూరము ప్రాకుచు వచ్చిరిగాని దురదృష్టవశమునఁ గస్తీ తిరుగుచున్న కావలివాఁ డాసమయమున నాసొ