పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/54

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

51

చేసినయెడల దేవరసాన్నిధ్యమునకు విచ్చేసి మాకానుక లర్పించి కృతప్రణాము లగుదుము." అని యందు వ్రాసి యుండెను. పరాక్రమవంతులయిన యీశత్రుపక్షమువారి నెల్లరఁ దనవంకకుఁ జేరఁదీసికొని సామ్రాజ్యమును బలపఱచి కొనుట యత్యావశ్యక మైనదిగా భావించి యందుల కంగీకరించినట్లు తెలుపుచు జగ్గరాజున కా దూఁతచేతనే ప్రత్యుత్తరము పంపి తన దుర్గాధ్యక్షున కీవర్తమానముఁ దెలియఁజేసి వారు వచ్చినయెడల నెట్టిమాటంకమును గలిగింపకుండ నుండవలయు నని యాజ్ఞ చేసెను.

మఱియు వారిని సామ్రాజ్యసామంతులుగ భావించి యధామర్యాదలు దప్పకుండ గౌరవభావముతో వారికి స్వాగతము నొసంగవలసిన దని కూడ నుత్తరువు గావించెను.

అమాయకుఁ డయినయారాయలు జగ్గరాజు పన్నిన యీమాయావ్యూహమునం దగుల్కొని యట్టియుత్తరువు లిచ్చియుండుటచేత జగ్గరాజునకును, వానిమిత్రులకును దుర్గములోఁ బ్రవేశించుట యత్యంతసులభసాధ్య మై పోయెడు. పాప మాదురదృష్టవంతుఁ డగురాయ లొకరీతిగఁ దలంప దైవ మింకొకరీతిగఁ దలంచెను.

అతఁడు తనమిత్రవర్గముతోఁ బ్రవేశించి రాయల పరివారమున కిఱుకపడకుండునట్లు తన రక్షకభటుల నాయా ద్వారములకడకుఁ బంపి వారివారిస్థానముల నిలువ నేర్పాటు గావించెను. ఇంతలో వీరు తలపెట్టిన ద్రోహకార్యము