పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

వెలుగోటి యాచమనాయఁడు

జగ్గరాజు, మాకరాజు, వెంకులతోఁ గలిసి రాయలను సింహాసనభ్రష్ఠునిఁ జేయుటకై ప్రయత్నించు చుండిరి. ఇ దంతయు నెఱింగి శ్రీరంగరాయలు జాగరూకతతో వ్యవహరించుచు దుర్గమును, నంతఃపురమును సురక్షితముగ నుంచుకొనియెను. ఈ కుట్రల కన్నిఁటికిని మూలకారకుఁడగు గొబ్బూరి జగ్గరాజు. శ్రీరంగరాజును రాజ్యభ్రష్ఠుని గావించి తనమేనల్లుఁడైన శిశువునకుఁ బట్టము కట్టి తాను సామ్రాజ్యము నేలుటకు మంచితరుణము సంభవింవిన దని సంతోషించుచుఁ దన కాప్తు లయినవారితో యోజించి ఘనమైన పన్నాగమును బన్ని వంచనచేఁ గార్యము నెఱవేర్పఁ దలఁచి విప్లవమునకు సంసిద్ధుఁ డయ్యెను.

సామ్రాజ్య వ్యవహారనిర్వాహకదృష్టియం దుండి శ్రీరంగరాయలు వీరిపట్ల నలక్ష్యభావముతోఁ గొంతకాల మేమరియుండి వీరివంకఁ జూడక పోయెను. అందువలన వీరి పన్నాగము లాతనికిఁ దెలియ రాలేదు. ఒకనాఁ డాకస్మికముగాఁ దనకు ముఖ్యశత్రువుగా నేర్పడియున్న మహామండలేశ్వర గొబ్బూరి జగ్గరాజ దేవమహారాజుకడనుండి యొక దూత రాయలకడకు వచ్చి యొక లేఖను సమర్పించెను.

"ఇదివఱకు మీకు ప్రతిపక్షినైయున్న నేనును, నాతోడి మిత్రులును, మా ప్రయత్నములను మేము విడిచి మిమ్మె సార్వభౌములుగ భావించి సేవింప నిశ్చయించుకొన్నారము.మీరు తొంటిభావములను విడిచి మా కనుజ్ఞ దయ