పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/52

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

49

తెలుపుచున్నాఁడు. వాని యారామములోనే మంచిగంధపుఁ గట్టెలతోడను, సుగంధద్రవ్యములతోఁడను రాయలప్రేతమునకు దహనసంస్కారకర్మ జరుపఁబడెనఁట! వీనితో వీని రాణులు మూవురుమాత్రము సహగమనము గావించిరఁట?

శ్రీరంగరాజును పట్టాభిషిక్తునిఁ జేయుటకు వేంకటపతిరాయలు సూచించిన యీమార్గము కొందఱకు సంతోషకరముగ నున్నను, మఱికొందఱకు దుఃఖకరముగ నుండెను. రాజబంధువులలోనేగాక సామ్రాజ్యమండలాధిపతులలోను, దండనాయకులలోను బెద్దకలవరము జనించె నఁట! పులికాట్టు నందున్న ఒలందులకు నీకలహమేరీతిగఁ బరిణమించునో, తమవర్తకమునకుఁ, దమవర్తకపుశాలాస్థానమునకు నెట్టివిపత్తు గలుగునో యని భయకంపితు లయిపోయిరఁట !

శ్రీరంగరాజు యధాశాస్త్రీయముగఁ బట్టాభిషిక్తుఁ డయ్యెను. జగ్గరాజు, మాకరాజు, రావెల వెంకటపతినాయఁడు తక్క తక్కిన సామంతమండలాధిపతులెల్లరును విననితు లై కానుక లర్పించి నమస్కరించి సార్వభౌమునిగ నంగీకరించిరి.

కొంతకాలము గడచినపిమ్మట శ్రీరంగరాయలు తనకొల్వున నున్న యుద్యోగస్థులలోఁ గొందఱపై ధనాపహరణము మున్నగు నభియోగములు రాఁగా విచారించి వారిని వారివారి పదవులనుండి తొలఁగించుట తటస్థించెను. వీరందఱు నదివఱకె శత్రువులుగా నేర్పడి కుట్ర చేయుచున్న