పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వనాథనాయకుఁడు

31

'అయ్యో! నాయొక్కనిలాభమునిమిత్త మెన్నోకుటుంబములు దిక్కులేక దుఃఖభాజనము లగుచున్నవి. ఒక్కనిసంతృప్తికై పెక్కుకుటుంబములను దుఃఖపరంపరలలో ముంచెత్తివిడుచుట ధర్మముగాఁ గన్పట్టుచుండలేదు' అని తలపోసి పశ్చాత్తాపమును దెలుపుచు నీ క్రింది జాబును వ్రాసి యొక దూతచేఁ దనప్రతిపక్షులకుఁ బంపెను.

"మీరైదుగురు, నేనొక్కఁడను. మననిమిత్తమై ప్రజలు దుఃఖపరంపరల పాలగుచున్నారు. అట్లు జరుగరాదు. మనము యుద్ధములను జాలించి మనసైన్యములను దూరముగా నిలిపి పోరాటముడిగించి యుభయసైన్యములనడుమ నొక శిలాస్తంభమునాటి మీరైదుగురును నాయొక్కనితో ద్వంద్వ యుద్ధమునకుఁ గడంగవలసినది. మీరు జయించిరా యీరాజ్యమును గైకొనుఁడు. నేను జయింతునా మీ రాజ్యమును విడిచి కట్టు పుట్టములతో మాత్ర మావలకుఁ బొండు. ఈ ప్రకారము మనము దైవసాక్షిగ ప్రతిజ్ఞలనుఁజేసి తామ్ర శాసనము వ్రాయించి యాశాసనము మీశిలాస్తంభమునకుఁ గట్టి బాహుయుద్ధమునకుఁ గడంగుదము. ఈ సమస్య యీ విధముగా మనయుభయుల నడుమ పరిష్కారమగుట నా కోరిక."

ఈ పయిజాబును వారు చూచుకొని 'మీ రొక్కరును మా యైదుగురుతోఁ దలపడుటధర్మము కాదు; మాలో నొక్కఁడు మాత్రము వచ్చును. మీరు వచ్చి వానితోఁ దల