పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

విశ్వనాథనాయకుఁడు

ణమును గావించెను. దీనినే పాళయము పద్ధతి యందురు. ఒక్కొక్కపాళయమున కొక్కొకయధికారి యుండును. వీరిని పాళెగాండ్రందురు. ఇట్లు నాయనివారు తనరాజ్యము నంతయు డెబ్బదిరెండుపాళయములుగా విభాగించి డెబ్బది యిర్వురునాయకుల కొసంగెను. ఈపాళయములయందు పాళెగాండ్రకుమాత్రమెగాక వీరిసంతతివారికి వారసత్వాధికార ముండవలయు నని శాసించెను. రాజ్యాంగమునందు రాజునకెట్టి యధికారముండునో యాపాళయములందు పాళెగాండ్రకు నట్టిస్వతంత్రాధికార మిచ్చెను. ఎచ్చుతగ్గుభేదముల ననుసరించి యాపాళెగాండ్రందరు ప్రధానప్రభుత్వము లేక కేంద్రప్రభుత్వమునకుఁ గప్పములు గట్టుచుండవలయును. యుద్ధములు తటస్థించినపుడు వీరలు తమసైన్యములతో రాజ్యాంగమునకుఁ దోడ్పడవలయును. మఱియును శత్రువులచే మధురాపురదుర్గము ముట్టడింపఁబడినపు డొక్కకదుర్గమును సంరంక్షిచుటకు నొక్కక పాళెగాఁడు బద్ధుఁడై యుండవలయును. ఇట్టి నిబంధనలతో నీ పాళెగాండ్రపద్ధతి యాదరణమునకుఁ దేఁబడినది. అయ్యది కాలపరిస్థితులకు దగియుండి యుపయుక్తముగా నుండెను గాని తరువాత నాపద్ధతి యనర్థదాయకముగాఁ బరిణమించెను. అయిన నిట్టిపద్ధతి యవలంభించుటవలన విశ్వనాథనాయనివారు దన పరిపాలనమునకుఁ గల యడ్డంకుల నన్నిటిని నరికట్టి స్వేచ్ఛగాఁ బరిపాలింపసాగెను. ఈ పాళెగాండ్రు తమరాఁబడిలో మూఁడవ