పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వనాథనాయకుఁడు

27

గానుపించుచున్నవి. ఈమండలములుగాక తిరువనంతపుర (ట్రావెన్కూరు) రాజ్యములోని యొకింతప్రదేశముగూడ నీతని రాజ్యమునఁ జేరియుండెను.

అప్పటి దేశకాలపాత్రస్థితుల ననుసరించి పరిపాలన సౌష్టవమునకుఁగాను విశ్వనాథనాయఁ డొక నూతనపరిపాలనా పద్ధతినవలంబింపవలసివచ్చెను. ప్రభువర్గములోఁ బ్రాచీనపాండ్య రాజులకు సామంతులుగనుండిన వారిసంతతినవారలుగలరు. వారల గౌరవమర్యాదలఁ గాపాడవలసి యుండెను. ఉద్యోగాపేక్షవలన నేమి, తురకలవలన నెట్టిహానియుఁ బొరయకుండ రక్షించుకొనఁ గోరియైననేమి యుత్తరము నుండివచ్చిన నాయకులు కొందఱు గలరు. తనకును, తనరాజ్యమునకును నధికముగాఁ దోడ్పడి సేవచేసిన ప్రభువర్గమువారుగలరు. వీరలెల్లరు నైకమత్యముగలిగితనకును, తన రాజ్యాంగమునకును, సకలసామ్రాజ్యమునకును దగు రీతిని దోడ్పడునట్లుగా వీరలెల్లరకును దనరాజ్యాంగమునందు జీవనోపాధులు గల్పింపవలసియుండెను. దేశమునందలి వ్యవసాయపద్ధతులు గడుహీనస్థితియం దుండుటచేత భూమి బంజరుగానుండి యధికభాగ మడవులచే నావరించుకొనబఁడి యుండెను. ఇందువలన దేశప్రజల క్షేమసౌకర్యములకు భంగము కలుగుచుండెను. దీనినంతయును జక్కపఱుపవలెనన్న రాజ్యాంగప్రభుత్వము సామంతప్రభువర్గమువారికి స్వతంత్రాధికారము నెక్కువగా నొసంగినఁగాని సాధ్యమగునది కాదు. అందువలన విశ్వనాథనాయనివా రొక నూతనవిధానమున రాజ్యాంగనిర్మా