పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

[3]

విశ్వనాథనాయకుఁడు

17

నారము. ఇఁక మీరింటికి పొం" డని రాయలు విశ్వనాథనాయని కుత్తరువు చేసెను. అంత విశ్వనాథనాయఁడు తన తండ్రిని చెఱనుండి విడిపించి యింటికిఁ దీసికొనిపోయి 'ఇఁక నేను మీ కుమారుఁడను; మీరు నాకు తండ్రులు; ఇంత పర్యంతము నేను మీకు శత్రువునుగాఁ బ్రవర్తించితిని; నన్ను క్షమింపు'మని శతవిధముల వేడికొని తండ్రిగారిని స్నానముచేయించి నూతనవస్త్రములనుఁ గట్టిపెట్టి బ్రాహ్మణ సమారాధనములను, దానధర్మములను గావించి సుఖముగా నుండునటుల చేసెను.

ఇటులు సుఖసంతుష్టుఁడైయుండి యొకనాఁడు నాగమనాయఁడు కుమారుని రప్పించి "నీవు రాజ్యము చేయవలయునను తలంపుతో నింతయెత్తు యెత్తినాను గాని మఱియొకటి గాదు. నాకు రాజ్యకాంక్ష లేదు. ఇంక నేను పరలోక సాధనమును జూచికొనియెదను. ఇంతవఱకు నేను సంపాదించిన ద్రవ్యమంతయు నున్నది. దీనిని తీసికొమ్ము. నీకు రాయలవారు రాజ్యము నిచ్చెదరు. చక్కఁగా నేలుకొమ్ము" అని పలికెను.

అంత నతఁడు "నాయనా! మీరార్జించిన ధనమును మీరే దానధర్మములు చేసికొని మీరే యనుభవింపుఁడు. నా కక్కఱలేఁదని ప్రత్యుత్తరము పలికెను. అందుకు సమ్మతింపక నాగమనాయఁడు తనపెద్దలు కూడబెట్టిన ధనమును, తా నార్జించినధనమునుఁ గూడఁ జూపించి దానినంతయు గైకొని సద్వినియోగమునకుఁ దెమ్మని కుమారునికి బోధిం