పుట:1857 ముస్లింలు.pdf/264

ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు


స్నేహహస్తం అందించి సాంఫిుక-ఆధ్యాత్మిక సమానత్వం ప్రతిపాదించిన ఇస్లాంను స్వీకరించిన సాధారణ ముస్లింలను, ఆనాటి ముస్లిం పాలకులను ఒకేగాటకట్టేసి అర్థం లేని, అసత్య విమర్శలకు పూనుకుని, భూమిపుత్రులైన సామాన్య ముస్లిం జనసముదాయాల పట్ల ముస్లిమేతరులలో వ్యతిరేక భావజాలం ఏర్పడానికి ప్రధానంగా కారణమయ్యారు.

1926లో ప్రముఖ బెంగాలీ రచయిత శరత్‌చంద్ర చట్టోపాధ్యాయ ముస్లిం జనసముదాయాల గూర్చి వ్యాఖ్యానిస్తూ వాస్తవంగా ముస్లింలు హిందువులతో కలసిమెలసి జీవిస్తారని చెప్పటం పెద్ద బూటకం. ముస్లింలు రాజ్యాలను స్థాపంచడానికి భారత దేశానికి రాలేదు, దోచుకోవడానికి వచ్చారు. దోపిడితో సంతృప్తి చెందక దేవాలయాలను ధ్వంసం చేశారు; దేవతా విగ్రహాలను పగులగొట్టారు. మహిళలను మానభంగం చేశారు. ఇతర మతాలకు చేసిన ఆగౌరవం, మానవతకు చేసిన గాయం ఊహించ వీలుకానిది అని అన్నాడు. ఆయన సామాన్య ప్రజలను మాత్రమే కాకుండా అక్బర్‌ గురించి కూడా వ్యాఖ్యానిస్తూ వీరు రాజులైన తరువాత కూడా తమ అసహ్యకర కాంక్షల నుండి విముక్తమ్ కాలేదు. సహనానికి మారు పేరన అక్బర్‌ ఈ విషయంలో అపఖ్యాతి పాలైన ఔరంగజేబు కంటే మంచి వాడేమీ కాదు అని పేర్కోన్నాడు. ( India's Freedom Movement and Muslims : M.K.A Siddiqi)

ఈ విధాంగా ముస్లిం ప్రభువులు అనగానే ఇస్లాం మతాన్ని స్థాపించేందుకు, ముస్లిమేతరులందర్నీ ముస్లింలుగా మార్చడానికి మాత్రమే ఇండియా వచ్చినట్టు తమ రచనల ద్వారా ప్రచారంగావించారు. ఆ విధంగా వచ్చిన ముస్లిం ప్రబు వుల రాజ్య విస్తరణ కాంక్షను అడ్డుకున్న వారందర్నీ, ముస్లిం పాలకులతో పోరాడిన చిన్నాచితక రాజులనూ హిందూమతోద్ధారకులని ప్రశంసించారు. మన రాష్ట్రానికి చెందిన కొమర్రాజు వేంకట లక్ష్మణరావు లాంటి మేధావులు కూడా ఈ భావజాలం పరిధిలోనే పనిచేశారన్నవిషయాన్ని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కంద్రీయ విశ్వవిద్యాలయం (లక్నౌ) చరిత్ర శాఖాధిపతి మహబూబ్‌ బాషా తన సుదీర్గ… వ్యాసంలో విపులంగా వివరించారు. (జాతీయ తత్వం ఒళ్ళో మతత్వం కొమర్రాజు రచనల పరిశీలన, మహబూబ్‌ బాషా, వీక్షణం మాసపత్రిక, జూన్‌, జూలై, ఆగష్టు, సెప్టంబరు 2007 నాటి సంచికలు, హైదారాబాద్‌)

1908 లో కొమర్రాజు వేంకట లక్ష్మణరావు వెలువరించిన మహమ్మదీయ మహాయుగం గ్రంథంలోని విజయనగర సామ్రాజ్యము అను అధ్యాయంలో విజయనగర

261