పుట:1857 ముస్లింలు.pdf/257

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

అధికారాన్ని కూడా రద్దు చేసేందుకు, చక్రవర్తి పరివారాన్ని ఎర్రకోట నుండి కుతుబ్‌ (Qutub) కు తరలించేందుకు Lord Ellenborough ఎత్తులు వేశాడు. ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తంకాగ ల ద న్నభ యంతో ఆ ప్రయత్నాలను మానుకుని మిన్నకుండిపోయాడు. ముస్లిం ప్రభువులు కట్టింటంచిన నిర్మాణాలను కూల్చివేయాలని, జుమా మసీదు, తాజ్‌ మహల్‌ లాంటి చారిత్రక కట్టడాలను, ఢిల్లీలోని ప్రతి మస్జిద్‌ను పూర్తిగా విధ్వంసం చేయాలనీ ఆంగ్లేయ సైనికాధికారులు హ్రస్వదృష్టితో ఆలోచించినా అటువంటి చర్యలకు అన్నివర్గాల ప్రజల నుండి వ్యతిరేకత ఎదురు కాగలదన్న భయంవల్ల ఆ ఆలోచనలకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది.

ఈ విధంగా స్వదేశీ పాలకుల పట్ల ప్రజలు ఏర్పర్చుకున్నఅతి బలమైన మానసిక అనుబంధం పటిష్టతను గమనించిన ఆంగ్లేయులు ఆ బంధాలను క్రమంగా బలహీన పర్చడానికి, చివరకు విఛ్ఛిన్నం చేయడానికి నడుం బిగించారు. ఈ బంధాన్ని బలహీన పర్చినట్టయితే ఇటు స్థానిక ప్రజలతో స్థానిక ప్రభువులు కలిగియున్న సంబంధాలు అంతరించడమే కాకుండా హిందూ-ముస్లింల మధ్యనున్న ఐక్యతకు విఘాతం కలిగించవచ్చన్నపన్నాగం పన్నారు.

ఆ నిర్ణయం మేరకు ముస్లిం పాలకుల పట్ల హిందూజనసముదాయంలో వ్యతిరేకత పెంపొందించేందుకు ప్రత్యేకంగా ప్రయత్నాలు ఆరంభించారు. ప్రదానంగా మధ్యా యుగాల నాటి ముస్లిం ప్రభువుల మీద బురదా చల్లెందుకు సన్నాహాలు ఆరంభించారు. మొగలులు ఇండియా ప్రవేశం చేసేంత వరకు చరిత్ర నమోదు చేయటం అలవాటు లేని భారతీయులకు తాము వారి చరిత్రను అందిస్తున్నామంటూ తమ ప్రయోజనాలకు అనుకూలంగా చిత్రించిన, వక్రీకరించిన చరిత్రను గ్రంథాల రూపంలో అందించారు. ఈ గ్రంథాల ద్వారా ముస్లిం ప్రభువుల నియంతృత్వం ప్రధానాంశం చేశారు. ముస్లిం పాలకులు స్థానిక ప్రజల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. ముస్లిం ప్రభువులంతా మత దురహంకారులని, ఇస్లాం మత ప్రచారం, వ్యాప్తి వారి లక్ష్యమని ప్రకంచారు. పరమత విద్వేషకు లైన ముస్లిం పాలకులు హిందువుల పవిత్ర దేవాలయాలను అపవిత్రం చేశారన్నారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత గల ఆలయాలను కూలద్రోశారన్నారు. వాస్తవ చరిత్ర వెల్లడిస్తున్న సత్యాలను, వాస్తవాలను పూర్తిగా మరుగునపెట్టి, ఈ

254