పుట:1857 ముస్లింలు.pdf/254

ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు


స్థానిక ప్రజల సమ్మతి సాధించేందుకు సృష్టించిన చరిత్ర ఈ మానసిక విభజన రేఖ ఏర్పడడానికి ప్రథమ కారణం మాత్రమే కాకుండా ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఆంగ్లేయులకు పూర్వం భారత భూభాగంలోని అత్యధిక భాగానికి పాలకులుగా ఉన్న ఇస్లాం మతావలంబకులైన రాజుల పాలన కంటే తమ పాలన అద్బుతంగా ఉందన్న అభిప్రాయం ప్రజలలో కలిగించడానికి ఆంగ్లేయాధికారులు ఒక పథకం ప్రకారంగా ప్రయత్నాలు చేశారు; ఆ ప్రయత్నాలను పలు మార్గాల ద్వారా సాగించారు.

ఆ ప్రయత్నాలలో భాగంగా 1857, తరువాత భారతీయుల పట్ల తాము అనుసరిస్తున్న రాజకీయ వైఖరిని ఆంగ్లేయులు పునస్సమీక్షించుకుని, 1821 నాటి తమ 'విభజించి పాలించు' (Divide et impera) విధానాన్ని1857 తరువాత మరింత ముమ్మరంగా అనుసరించటం ఆరంభించారు. ఈ అనుసరణలో భాగంగా గతంలోని ముస్లింల పాలన కంటే ఆంగ్లేయులు పాలన చాలా బాగుందన్న ప్రచారాన్ని నిర్వహించారు.

భారత దేశంలో ముస్లిం రాజులు ప్రవేశించక ముందు ఇక్కడి సభ్యత-సంస్కతి మహోన్నతంగా ఉన్నాయని, ముస్లింల ప్రవేశం తరువాత, ముస్లిం పాలకుల చర్యల వలన అవి అథోదశకు చేరుకున్నాయని ప్రచారం చేశారు. ఈ దుష్ప్రచారం కోసం ప్రత్యేకంగా కొందరు అధికారులను, చరిత్రకారులను నియమించి, కుప్పలు తెప్పలుగా గ్రంథాలు రాయించారు. ఆ గ్రంథాలలోని విషయాలను ప్రజలలో ప్రచారానికి పెట్టారు. ఈ కార్యక్రమానికి ఆంగ్లేయ ప్రభుత్వం, అధికారులు అన్ని మార్గాలను, అన్ని అవకాశాలను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు.

ఈ విషయంలో సర్‌ విలియం జోన్స్‌, థామస్‌ ముర్రే, ఛార్లెస్‌ గ్ర్‌ాం, జేమ్స్‌ మిల్‌, యెచ్‌.యం. ఇలియ్‌ లాంటి ఆంగ్లేయ చరిత్రకారులు, అధికారులు చాలా బలమైన పాత్ర పోషించారు. ఈ లక్ష్యాన్ని ప్రచారంలో పెట్టేందుకు పలు పుస్తకాలు రాశారు. కరపత్రాలు ప్రచురించారు. ఆంగ్ల ప్రభుత్వం ఆర్థిక సహాయం మీద ఆధారపడిన తైనాతీల చేత తాము కోరిన విధంగా ఆంగ్లేయులు చరిత్ర గ్రంథాలను రాయించుకున్నారు. ఆ విధంగా రాయబడిన చరిత్రను తమ అనుకూల ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్నిప్రస్తావిస్తూ J.S. Grewal తన పుస్తకం Muslim Rule in India : The Assessment of British Historians (Oxford University

251