పుట:1857 ముస్లింలు.pdf/252

ఈ పుట ఆమోదించబడ్డది

విస్మరణకు గురైన త్యాగాలు


అవధ్‌ నవాబు వాజిద్‌ అలీ ఖాన్‌ను ఆంగ్లేయులు గద్దె దించి కలకత్తాకు పంపించినా, ఆయన భార్య బేగం హజరత్‌ మహల్‌ మాత్రం అవధ్‌ రాజధాని లక్నోలో ఉండిపోయి స్వదేశీపాలకులను, ప్రజలను ఏకం చేసి ఆంగ్లేయుల నుండి లక్నోకు విముక్తి కలిగించి 10 మాసాల పాటు తన బిడ్డడు బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట స్వతంత్రంగా రాజ్యం చేశారు. ఆంగ్ల సేనలతో పలుమార్లు తలపడి, చివరకు లక్నోను భారీ సంఖ్యలో బ్రిటిష్‌ బలగాలు చుట్టుముట్టగా పోరాటం సాగిస్తూనే గత్యంతరం లేని పరిస్థితులలో ఆమె నేపాల్‌ అడవుల్లోకి నిష్క్రమించారు. అజ్ఞాతంలో బలగాలను సమకూర్చుకుంటున్నఆమెకు 20 లక్షల నజరానా ఇస్తామని ప్రకటించినా మాతృభూమి తప్ప తనకు మరొకటి అక్కర లేదంటూ పోరుబాట వీడకుండా ముందుకుసాగుతూ 1874 లో నేపాల్‌ అడవుల్లో సామాన్య మహిళగా కన్నుమూసింది. ఆమె భౌతికకాయాన్ని ఖాట్మండులో ఇమాంబారాలో ఖననం చేశారు. ఆ సమాధి ప్రాంతం 1957నాటికల్లా శిథిలావస్థకు చేరుకుంది

1957లో ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్బంగా ఖాడ్మండూలోని ఆ మహాయోధ సమాధికి ఏర్పడిన దుస్థితిని ఆమె వంశజుడు మీర్జా ఆజం ఖదీర్‌ స్వయంగా ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టికి తెచ్చారు. ఆ మహాయోధురాలి స్మతి చిహ్నంగా మిగిలి ఉన్నసమాధి నిర్లక్ష్యానికి గురికావడం గురించి తెలుసుకున్న ప్రధాని నెహ్రూ బాధను వ్యక్తం చేస్తూ తగిన శ్రద్ధ తీసుకుంటానని తెలిపి బేగం హజరత్‌ మహల్‌ సమాధి ఫొటోలు తీయించి ఆజం ఖదీర్‌కు పంపారు. ఆ ఫోటోలతోపాటుగా నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ఆ సమాధి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకుంటుందని ప్రధాని నెహ్రూహామీ ఇచ్చారు.

ఆ హామీలు అమలుకు నోచుకోలేదు సరికదా ఆ సంవత్సరం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ శతాబ్ది ఉత్సవాలలో బేగం హజరత్‌ మహల్‌ ప్రస్తావన కూడా రాలేదు. నేపాల్‌లోని బేగం హజరత్‌ మహల్‌ సమాధి మరింతగా విస్మరణకు గురై పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న విషయాన్ని ఆ తరువాత పత్రికలు, ప్రజలు నెత్తీనోరు కొట్టుకున్నాకగాని ప్రభుత్వానికీ, ప్రభుత్వాధి నేతలకూ ఆ విషయం పట్టలేదు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మీద విమర్శలు చెలరేగడంతో లక్నోలోని ఒక పార్కుకు బేగం హజరత్‌ మహల్‌ పేరుపెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 1857 నాటి ప్రముఖ యోధాగ్రేసులలో ఒకరైన మౌల్వీఅహ్మదుల్లా ఫైజాబాది

249