పుట:1857 ముస్లింలు.pdf/248

ఈ పుట ఆమోదించబడ్డది

త్యాగాలొకరివి-భోగాలొకరివి

పెత్తనం చలాయించారు. ప్రబుత్వం అండదడలతో మరింత సంపదను పోగేసుకున్నారు. ఆంగ్లేయుల కరుణా కటాక్షాలతో వారసత్వంగా అందివచ్చిన అన్ని భోగభాగ్యాలను, ఆవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకుని సర్వసుఖాలను అనుభవించారు.

ఆయా సంస్థానాలలో ప్రజలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా

సంస్థానాధీశులు మాత్రం తమ గడపల వద్దకు తరలి వస్తున్నపెత్తనం-సంపదను

వదలుకోలేక ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఆ కారణంగా బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమాలను ఏమాత్రం సహించలేదు. సంస్థానాల పరిధిలో ఆంగ్లేయ వ్యతిరేకత లేశమంత వ్యక్తమైనా సహించక జాతీయోద్యమకారుల మీద విరుచుకు పడుతూ ఆంగ్లేయుల పట్ల తమకు వారసత్వంగా లభించిన స్వామి భక్తిని సంస్థానాధీశులు దండిగా చాటుకున్నారు.

ఈ సంస్థానాధీశులలో కొంత మంది రానున్నరాజకీయ వాతావరణాన్ని పసిగట్టి జాతీయోద్యమకారులకు అనుకూలంగా వ్యవహరించారు. జాతీయోద్యమం ఉధృతమౌతూ ఆంగ్లేయుల ఉద్వాసన తప్పని పరిస్థితులు తాండవించడంతో ఊసరవెల్లుల్లా వ్యవహరించి, రంగులు మార్చి, ఆంగ్లేయుల పక్షం నుండి జాతీయ పక్షం చేరుకున్నారు. ఆయాచితంగా లభించి ఉన్న సంపదను వెచ్చించి జాతీయోద్యమంలో ఒక వెలుగు వెలిగారు. అనంతరం అందివచ్చిన అవకాశాలన్నింటినీ సొంతం చేసుకుని రాజకీయంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా మరింత సంపన్నులయ్యారు.

స్వతంత్ర భారతంలో ఆ సంపద అండదండలతో సంస్థాధీశులు రంగులు మార్చి రాజకీయ వేత్తలుగా రాజకీయ రంగ ప్రవశం చేశారు. అనాదిగా రాజభక్తి, ప్రబ భక్తి అపారంగా గల భారతీయులు, సుమారు వంద సంవత్సరాల క్రితం నాటి సంస్థానాధీశులు, ఆ సంస్థానాధీశుల వారసులు నిస్సిగ్గు గా పాల్పడిన విద్రోహాన్ని, అలనాటి వారి పాపాలను పూర్తిగా మర్చిపోయి రాజకీయ రంగంలో వారికి పెద్దపీట వేయడం స్వతంత్ర భారతంలోని పెను విషాదాం !

ఆ అవకాశాన్నిఅందిపుచ్చుకున్న సంస్థానాధీశుల వారసులు క్రమంగా ప్రజాస్వామిక వ్యవస్థలోని లోటుపాట్లను తమకు అనుకూలంగా మలచుకుని, తిన్నగా రాజకీయ రంగంలో గట్టిపట్టును సంపాదించుకున్నారు. ప్రస్తుత ప్రజాస్వామిక రాజకీయాలలో మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్‌గిరీ లాంటి పెద్దపెద్ద పదవులను

245