పుట:1857 ముస్లింలు.pdf/239

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

కాకుండా అతి సాదాసీదాగా బహదాూర్‌ షా జఫర్‌ సమాధి వద్ద నిర్మాణం జరిగింది.

బహదాూర్‌ షా జఫర్‌ కోరిక మేరకు ఆయన అవశేషాలలను రంగూన్‌ నుండి తెచ్చి ఢిల్లీలోని కుతుబ్‌మినార్‌ వద్ద తన సమాధి కోసం ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న స్థలంలో మళ్ళీ ఖననం చేయాలని ఆ రోజు నుండి సాగుతున్న ప్రయత్నాలు ఈనాటికి కూడా సఫలం కాలేదు. నూటనలభైయిదు సంవత్సరాల తరువాత కూడా అలనాటి డిమాండ్‌ ప్రజలలో ఈరోజు వరకూ జీవించి ఉంది. ప్రస్తుత ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామ 150 సంవత్సరాల సంబరాల సందర్భంగానైనా రంగూన్‌లోని జఫర్‌ సమాధిలోని మృతికనైనా తెచ్చి జఫర్‌ కోర్కె నెరవేరేట్టుగా సమాధి నిర్మించినట్టయితే, ప్రదమ స్వాతంత్ర సంగ్రామ యోధుడు, చిట్ట చివరి మొగల్‌ ప్రభువును గౌరవించుకున్నట్టు కాగలదు.

బహదాూర్‌ షా జఫర్‌ చిన్నపాటి కోర్కె నెరవేరడం అసాధ్యంగా మారిన వాతావరణంలో ఆయన వారసుల పరిస్థితులు అంతకంటె భిన్నంగా లేదన్న విషయాన్ని ఆయన వారసులను పలకరిస్తే వారి కన్నీటి కధలు వెల్లడవుతాయి.

1963లో ప్రముఖ పాత్రికేయులు ఇబ్బార్‌ రబ్బీ డిల్లీలో నివసిస్తున్న బహదూర్‌ షా జఫర్‌ మునిమనవరాలు కమర్‌ సుల్తానా, ఆమె సోదరుడు షెహజాదా మిర్జా హమీద్‌లను ఇంటర్యూ చేశారు. ఆ సందర్బంగా అన్నాచెళ్ళెలు తమ బాధలను, భారంగా బ్రతుకులీడుస్తున్న తీరును వివరించారు.

భారత ఉపఖండం విభజన సమయంలో ఢిల్లీలో జరిగిన మారణకాండలో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆమె సుదీర్ఘ అనారోగ్యంతో బాధాపడుతూ కుమార్తెల సంపాదన మీద ఆధారపడుతున్నానన్నారు. అలనాడు బహదాూర్‌ షా జఫర్‌ వెంట ఉండి తన దుర్బోధలతో ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామానికి, స్వయంగా జఫరకు వెన్నుపోటు పొడిచి అన్నివిధాల ఆంగ్లేయులను సమర్థించిన విప్లవ ప్రతీఘాతకుడు మిర్జా ఇలాహి బక్ష్ జఫర్‌కు స్వయాన వియ్యంకుడు.

ఈయన బ్రిటిషర్లకు అనుకూలంగా ప్రవర్తిస్తూ పోరుబాట సాగుతున్న బహదూర్‌ షా జఫర్‌ను తొలి నుండి నిరుత్సాహపర్చుతూ వచ్చాడు. 1857 సెప్టంబరు మాసంలో డిల్లీ పోరాటం చివరి దశకు చేరుకున్న సందర్బంగా తాడోపేడో తేల్చుకునేందుకు చక్రవర్తి బహదాూర్‌ షా జఫర్‌ స్వయంగా ఆంగ్ల సేనల మీద దాడి జరిపేందుకు సిద్దపడ్డారు.

236