పుట:1857 ముస్లింలు.pdf/238

ఈ పుట ఆమోదించబడ్డది

త్యాగాలొకరివి-భోగాలొకరివి

బహదూర్‌ షా జఫర్‌ తాను పుత్తిపెరిగిన గడ్డ మట్టిలో కలసిపోవాలని బలంగా ఆకాంక్షించారు. ఆ కోర్కె మేరకు స్వయంగా తన సమాధి కోసం కుతుబ్‌ మీనార్‌ వద్ద స్థలం కూడా ఆయన ఎంపిక చేసి పెట్టుకున్నారు. ఆయన ఆకాంక్షకు వ్యతిరేకంగా రంగూన్‌కు తరలించటంతో తీవ్రంగా వ్యథ చెందారు. మాతృభూమిలో తన సమాధికి రెండు గజాల స్థలం కూడా కరువైన స్థితిని తలచుకుని సువిశాల మొగల్‌ సామ్రాజ్యానికి చెందిన చక్రవర్తి తన తుది రోజుల్లో దీనంగా విలపించాడు. ఆయన తన గుండె లోతుల్లోంచి పెల్లుబుకుతున్న ఆవేదనతో నువ్వెంత దురదృష్టవంతుడివి జఫర్‌ ! నీసమాధికోసం నీ మాతృభూమిలో రెండు గజాల స్థలం కూడ నీకు కరువయ్యింది. (కిత్‌నా బద్‌నసీబ్‌ జఫర్‌. దఫన్‌కేలియే, దోగజ్‌ జమీన్‌ భీ న మిలీ కూ-యే-యార్‌ మే) అని భవిష్యత్తు పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

1903లో రంగూన్‌లోని జఫర్‌ సమాధిని చూడ్డానికి కొందరు ప్రముఖులు రంగూన్‌ వచ్చేంత వరకు మొగల్‌ చక్రవర్తి సమాధి ప్రాంతం ఎటువంటి ఆలనా పాలనా లేకుండా ఉండిపోయింది. అసలు ఆయన సమాధి జాడ కూడ కన్పించలేదు. రంగూన్‌ వచ్చిన ప్రముఖుల బృందం అతి కష్టం మీద రంగూన్‌లో జఫర్‌ సమాధి వద్ద స్థానికుల సహకారంతో సమాధి స్థలాన్ని స్మారక నిర్మాణం కోసం నిధుల అభ్యర్థన గుర్తించి అక్కడ చక్రవర్తి గౌరవార్ధం ఆయన స్మృతి చిహ్నంగా ఒక భవ్య నిర్మాణం చేయదలిచారు. ఈ మేరకు తగిన నిధుల కోసం వినతి పత్రాన్ని, దానితో పాటుగా భవ్య నిర్మాణం నమూనాను కూడాతయారు చేయించారు. 46 ఏండ్ల తరు వాత కూడా మొగల్‌ పాలకులంటే క్రోధం తగ్గని ఆంగ్లేయులు అడ్దుకోవటంతో ఆ ప్రయత్నం ఆగి పోయింది. కాగా 1934లో ఆయన మరణించిన 74 ఏండ్ల తరువాత మళ్ళీ మరికొందరి ప్రయత్నాల మూలంగా 1903లో అనుకున్నట్టు


235